AP Inter hall ticket: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయ్‌.. వాట్సాప్‌లోనే సింపుల్‌గా డౌన్‌లోడ్‌

Published : Feb 07, 2025, 10:19 AM ISTUpdated : Feb 07, 2025, 10:22 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హాల్‌ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. హాల్‌ టికెట్లను సింపుల్‌గా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
13
AP Inter hall ticket: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయ్‌.. వాట్సాప్‌లోనే సింపుల్‌గా డౌన్‌లోడ్‌

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియ్‌ బోర్డ్‌ ప్రాక్టీకల్‌ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగానే హాల్‌ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్ ఇయర్‌లో సైన్స్‌, కామర్స్‌, ఆర్ట్స్, వొకేషనల్‌ కోర్సుల్లో ఉన్న విద్యార్థులకు ప్రాక్టీకల్స్‌ నిర్వహించనున్నారు. విద్యార్థులు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకొని తమ పేరు, ఎగ్జామ్‌ సెంటర్‌, ఫొటో సరిగ్గా ఉన్నాయా లేదా అన్ని వివరాలను క్రాస్ చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 
 

23

ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే.. 

* ముందుగా విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. 

* అనంతరం డౌన్‌లోడ్‌ హాల్‌ టికెట్‌ 2025 లింక్‌ను క్లిక్‌ చేయాలి. 

* ఆ తర్వాత ప్రాక్టికల్ హాల్‌ టికెట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. 

* స్టూడెంట్‌ రిజిస్టర్‌ నెంబర్‌, డేటాఫ్‌ బర్త్‌ వంటి వివరాలను ఎంటర్‌ చేయాలి. 

* వెంటనే ఏపీ ఇంటర్‌ ప్రాక్టికల్ ఎగ్జామ్‌ హాల్‌ టికెట్‌ 2025 స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. ఆ కాపీని డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుంది. 

ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి.. 

హాల్‌టికెట్‌లో కింద తెలిపిన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో కచ్చితంగా ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలి. 

* విద్యార్థి పూర్తి పేరు 

* రూల్‌ నెంబర్‌ 

* పుట్టిన తేదీ వివరాలు 

* తండ్రి పేరు 

* మీడియం 

* సబ్జెక్ట్ పేరు, ప్రాక్టికల్ ఎగ్జామ్‌ కోడ్‌ 

* స్కూల్‌ పేరు, జిల్లా 

* ఎగ్జామినేషన్‌ సెంటర్‌ పేరు 

* పరీక్ష తేదీ, సమయం 
 

33

వాట్సాప్‌లో కూడా.. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల వాట్సప్‌ గవర్నెన్స్ సేవలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 161 రకాల ప్రభుత్వ సేవలను వాట్సాప్‌లో పొందే అవకాశం కల్పించారు. కాగా తాజాగా ఇంటర్‌ విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షల హాల్‌ టికెట్లను సైతం వాట్సప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. శుక్రవారం నుంచి విద్యార్థులు నేరుగా వాట్సాప్‌లో హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఫోన్‌లో 95523 00009 నెంబర్‌ను సేవ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్‌ ఎగ్జామ్‌ సెక్షన్‌ను సెలక్ట్‌ చేసుకొని సంబంధిత వివరాలను అందిస్తే హాల్ టికెట్‌ పొందొచ్చు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ కలిపి మొత్తం 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. 
 

click me!

Recommended Stories