గర్వంగా చెబుతున్నా... నా చెల్లెల్లకు ఇస్తున్న ఆస్తి ఇదే..: సీఎం జగన్

First Published Apr 19, 2021, 4:12 PM IST

క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కిన సీఎం వైఎస్ జగన్ 10,88,439 పిల్లలకు మేలు చేస్తూ వారి తల్లుల ఖాతాల్లో రూ.671.45 కోట్లు జమ చేశారు. 

అమరావతి: జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా 2020-21విద్యా సంవత్సరం తొలి త్రైమాసికం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తం లబ్దిదారుల ఖాతాల్లోకి జమయ్యింది. క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కిన సీఎం వైఎస్ జగన్ 10,88,439 పిల్లలకు మేలు చేస్తూ వారి తల్లుల ఖాతాల్లో రూ.671.45 కోట్లు జమ చేశారు.
undefined
ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... అన్ని శాఖలు సమన్వయంతో, జగనన్న విద్యా కానుక పథకాన్ని ఓన్‌ చేసుకున్నాయని... ఇది నిజంగా గొప్ప కార్యక్రమం అన్నారు. ఇందులో పాలు పంచుకోవడం, ఇది తన ద్వారా జరగడం దేవుడిచ్చిన అదృష్టమన్నారు.
undefined
''పెద్ద చదువన్నది ఇప్పుడు ఒక కనీస అవసరంగా మారిపోయింది. పేదరికం నుంచి బయటపడేందుకు, మెరుగైన ఆలోచనలకు, మంచి ఉద్యోగానికి–ఉపాధికి, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, సమాజంలో గౌరవం పొందటానికి, ఒక మనిషి తన తరవాతి తరం భవిష్యత్తుకు మెరుగైన బాటలు వేయటానికి పెద్ద చదువన్నది కనీస అవసరంగా మారింది. నా తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఇస్తున్న ఆస్తి చదువు అని గర్వంగా చెబుతున్నాను'' అన్నారు సీఎం జగన్.
undefined
''15 సంవత్సరాలకు 10వ తరగతి, 17 ఏళ్ళకు ఇంటర్, 20–21 మధ్య డిగ్రీ పూర్తి చేసిన ఒక చెల్లెమ్మ... ఒక తమ్ముడు, తమకు 60–70 ఏళ్ళు వచ్చే వరకు ఆ చదువు పునాది మీదే తన భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి బేరీజు వేసుకోగలిగితే.. ఏ అప్పులు లేకుండా మంచి చదువులు చదివితే, వారి జీవితాలు ఎలా మారుతాయన్నది విజువలైజ్‌ చేసుకుంటే.. చదువు విలువ ఏమిటన్నది అర్ధమవుతుంది'' అన్నారు.
undefined
''9,79,445 మంది తల్లులు, దాదాపు 10.88 లక్షలకు పైగా పిల్లలకు మేలు కలిగించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నా సుదీర్ఘ 3,648 కి.మీ పాదయాత్రలో చాలా చోట్ల పిల్లలు, వారి తల్లిదండ్రులు తమ సమస్యలు చెప్పుకున్నారు. స్వయంగా వారి కష్టాలు, బాధలు చూశాను. అందుకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తున్నాను'' అని సీఎం పేర్కొన్నారు.
undefined
''ఇవాళ రూ.675 కోట్లకు పైగా మొత్తాన్ని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద ఇస్తున్నాం. ప్రతి త్రైమాసికం ఫీజును, ఆ త్రైమాసికం పూర్తి కాగానే ఇవ్వగలగడం గొప్ప విషయం. గత ప్రభుత్వ హయాంలో 2014–2019 వరకు రూ.1880 కోట్లు బకాయిలు పెట్టి పోయారు. అప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఇచ్చింది కూడా అరకొరనే. రూ.4,208 కోట్లు ఈ ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద గత ఏడాది చెల్లించింది. ఆ విధంగా ఎక్కడా బకాయిలు లేకుండా చేశాం'' అన్నారు.
undefined
''ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి, కోవిడ్‌ వల్ల కాలేజీలు గత ఏడాది డిసెంబరులో మొదలు కాగా తొలి త్రైమాసికానికి సంబంధించి ఇవాళ పేమెంట్లు చేస్తున్నాం. గత ఏడాది 10.11 లక్షల పిల్లలకు మేలు చేస్తే, ఈసారి ఆ సంఖ్య 10.88 లక్షలకు చేరింది. అంటే 77 వేల మంది పిల్లలు ఎక్కువయ్యారు. ఆ మేరకు 9,79,445 మంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నాం. ఆ విధంగా వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తే, వారు వారం రోజుల్లో ఆ మొత్తం కాలేజీలకు చెల్లిస్తారు. ఇది గతంలో ఎవరూ చేయలేదు'' అన్నారు.
undefined
''ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే ప్రభుత్వం ఫీజుల మొత్తాన్ని తల్లుల ఖాతాలో వేస్తే, ఆ పిల్లవాడి తల్లి లేదా తండ్రి స్వయంగా కాలేజీకి వెళ్లి, ఫీజలు కట్టేటప్పుడు, ఆ కాలేజీలో లోపాలు ఉన్నా, వసతులు లేకపోయినా నిలదేసే అవకాశం ఉంటుంది. అలాగే 1902 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే ప్రభుత్వం స్పందిస్తుంది. కాలేజీలో పరిస్థితి మారేలా చూస్తుంది. ఆ విధంగా తల్లులకు కాలేజీలను ప్రశ్నించే అవకాశం కలుగుతుంది. అదే విధంగా కాలేజీలలో జవాబుదారీతనం కూడా పెరుగుతుంది'' అన్నారు సీఎం జగన్.
undefined
click me!