మహిళా పారిశుద్ద్య కార్మికులపై పోలీసుల జులుం... పలువురికి గాయాలు

First Published Apr 15, 2021, 1:06 PM IST

 మహిళా పోలీసులు లేకుండానే  మంగళగిరిలో నిరసన తెలుపుతున్న మహిళా కార్మికులను అరెస్టు చేయించారని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు.  

మంగళగిరి: అక్రమంగా తొలగించిన శానిటేషన్ మహిళా కార్మికురాలు నక్క వెంకటేశ్వమ్మను పనిలోకి తీసుకోవాలని, కార్మికులకు ఖాతాలో ఈఎస్ఐ, పీఎఫ్ సొమ్ము జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో మంగళగిరిలో గత వారం రోజులుగా సమ్మె చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కు, సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకు వెళ్లడం జరిగింది. అయినప్పటికీ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడంతో బుధవారం ఆటో నగర్ లో గల శానిటేషన్ వాహనాలను బయటకు పోనీయకుండా కార్మికులు అడ్డుకున్నారు.
undefined
ఉదయం నుండి ఇలా అడ్డుకోవడంతో పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న కార్మికులను, సిఐటియు నాయకులను పోలీసులు అరెస్టులు చేశారు. మహిళా పోలీసులు లేకుండానే మహిళా కార్మికులను అరెస్టు చేయించారని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలకు గాయాలయ్యాయని తెలిపారు. అరెస్టు చేసిన నాయకులను, కార్మికులను పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
undefined
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి చెంగయ్య మాట్లాడుతూ... శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్మికులను, నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. మున్సిపల్ అధికారులు పనిలో నుంచి తొలగించిన కార్మికులను పనిలోకి తీసుకోవడానికి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.
undefined
అరెస్టు కాబడిన వారిలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రరావు, సిఐటియు పట్టణ కార్యదర్శి వై కమలాకర్, యూనియన్ నాయకులు, మహిళా కార్మికులు ఉన్నారు. మొత్తంగా 15 మందిని అరెస్ట్ చేశారు.
undefined
click me!