AP Cyclones: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తుఫానులు అధికంగా వస్తాయెందుకు?

Published : Oct 28, 2025, 11:17 AM IST

AP Cyclones: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరచూ తుఫానుల బెడద ఎక్కువ. సంవత్సరానికి ఒక్క తుఫానైనా ఏపీ ప్రజలను అల్లాడించేస్తుంది. ఇలా ఏపీకే తుఫానులు, భారీ వర్షాలు అధికంగా ఎందుకు వస్తాయి? 

PREV
15
ఏపీకే తుఫానులు ఎందుకు?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తుఫానులు కొత్త కాదు. ప్రతి ఏడాది ఏదో ఒక కొత్త పేరుతో తుఫానులు వస్తూనే ఉంటాయి. ఈ రాష్ట్రానికి ప్రతి ఏడాది తుఫానులు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం భౌగోళిక స్థానం. అలాగే ఆ రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు. ఈ రెండింటి కారణంగానే తరచూ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ నుంచి నెల్లూరు దాకా ఉన్న తీర ప్రాంత ప్రజలకు తరచూ తుఫానులు బెడద తగులుతూనే ఉంటుంది.

25
తీర రేఖ ఎక్కువ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 974 కిలోమీటర్లు పొడవైన తూర్పు తీరరేఖ ఉంది. ఇది బంగాళాఖాతం వల్ల ఏర్పడింది. ఈ బంగాళాఖాతం ఉష్ణ మండలంలో ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండే సముద్రపు నీరు కూడా ఎక్కువ వేడిని కలిగి ఉంటుంది. వేడి నీరు తుపానుల ఉత్పత్తికి ముఖ్యమైన ఇంధనంగా మారుతుంది. అందుకే బంగాళాఖాతంలో తరచూ తుఫానులు వచ్చి ఏపీని ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

35
ఈ రాష్ట్రాలకే తుపాను ముప్పు

ప్రపంచంలోనే బంగాళాఖాతంలో తుఫానులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే బంగాళాఖాతం సముద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ భాగంలో వ్యాపించి ఉంది. ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, తుఫానులు సాధారణంగా వాయువ్యదిశగా లేదా వాయువ్య పడమర దిశగా కదులుతూ ఉంటాయి. అంటే అవి మొదటిగా తాకే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత ఒడిశా, పశ్చిమబెంగాల్ ను తాకుతాయి. ఒక తుఫాను తాకే మొదటి రాష్ట్రం ఏపీనే కాబట్టే ఇక్కడే ప్రతి ఏడాది తుఫానులు వస్తుంటాయి.

45
ఈ నెలల్లోనే తుపానులు

ఆంధ్రప్రదేశ్లో ఏ నెలలో తుఫానులు అధికంగా వస్తాయో తెలుసా? ఏప్రిల్ నుండి జూన్ వరకు. అంటే సరిగ్గా వర్షాకాలానికి ముందు నెలలో తుఫానులు ఏర్పడే అవకాశం ఎక్కువ. అలాగే ఋతుపవనాలు కాలం ముగిసిపోయిన తర్వాత.. శీతాకాలం మొదలయ్యే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కూడా భారీ తుఫానులు వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు భారీ తుఫాన్లు వస్తాయి. ఈశాన్యం నుంచి వచ్చే ఋతుపవనాల గాలులు, సముద్ర ఉష్ణోగ్రతలు కలిపి తుఫాన్లు ఏర్పడడానికి కారణం అవుతాయి. బంగాళాఖాతంలో వాయు పీడనంలో వచ్చే తేడాలు కూడా తుఫానులకు కారణాలే. అవి తుపానుగా మారి మొదట ఏపీ తీరానికే దూసుకొస్తాయి. తీరం అధికంగా ఆంధ్ర రాష్ట్రానికే ఉంది కాబట్టి మొదటి ప్రభావితం అయ్యేది ఆంధ్ర ప్రజలే.

55
ఈ జిల్లాల ప్రజలకే

ఏపీలో ఏర్పడే తుపానుల వల్ల ప్రధానంగా ప్రభావం పడేది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల వారికే. ఈ జిల్లాలు తీరానికి చాలా దగ్గరగా ఉంటాయి. వీటికి తీర రేఖ కూడా ఎక్కువ. అందుకే ప్రతి ఏడాది తుఫానుల బారిన పడే అవకాశం ఈ జిల్లా ప్రజలకే అధికం. వీరికి భారీ వర్షాలు, ఈదురు గాలులు, తుఫానులు... అన్నింటినీ భరించడం అలవాటుగా మారిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories