Wheebox Report 2025 : మహిళా సాధికరతకు ఆంధ్ర ప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ రాష్ట్రంలో మహిళా ఉద్యోగుల పరిస్థితి అద్భుతమని ప్రముఖ సంస్థ వీల్ బాక్స్ నివేదిక వెల్లడించింది.
Wheebox Report 2025 : రాజకీయ, వ్యాపార, సినీ రంగాల్లో మహిళలు భాగస్వామ్యం పెరుగుతోంది... కొన్ని రంగాల్లో అయితే మహిళలు మగవారిని ఏనాడో దాటిపోయారు... మరికొన్ని రంగాల్లో గట్టి పోటీ ఇస్తున్నారు. ఇలా ఉద్యోగాలు చేసి తమ కాళ్లపై తాము నిలబడి ఆత్మాభిమానంతో బ్రతకాలనుకునే మహిళ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకే ఇంటివద్దే ఉండే సాధారణ గృహిణుల సంఖ్యతగ్గి మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ విషయాన్ని ప్రముఖ సంస్థ వీబాక్స్ (Wheebox) వెల్లడించింది.
గ్లోబల్ కంపెనీ వీబాక్స్ విడుదల చేసిన ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 భారతదేశంలో మహిళల ఉద్యోగ సామర్థ్యం, పని వాతావరణంపై వచ్చిన మార్పులను వివరిస్తోంది. ఈ నివేదిక ప్రకారం దేశంలో ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న మహిళల శాతం 47.53%గా ఉంది. గత ఏడేళ్లలో మహిళల ఉద్యోగ సామర్థ్యం హెచ్చుతగ్గులకు లోనైన ప్రస్తుతం సానుకూల ధోరణి కనిపిస్తోందని ఈ నివేదిక తెలిపింది.
25
మహిళా ఉద్యోగులకు ఉత్తమ రాష్ట్రం ఏపీ
వృత్తిపరంగా పని చేయడానికి ఇష్టపడే ప్రదేశాల విషయంలో మహిళలకు స్పష్టమైన ప్రాధాన్యతలు ఉన్నాయని వీబాక్స్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 చెబుతోంది. సురక్షితమైన వాతావరణం, మంచి మౌలిక సదుపాయాలు, కెరీర్ వృద్ధికి అవకాశాలు వంటి ప్రాధాన్యతలను మహిళా ఉద్యోగులు కలిగివుంటున్నారని ఈ నివేదిక చెబుతోంది. దీని ప్రకారం మహిళా నిపుణులు ఎక్కువగా ఆసక్తి చూపే మొదటి పది రాష్ట్రాల జాబితాను వీబాక్స్ ప్రకటించింది. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది.
35
వీబాక్స్ నివేదిక ప్రకారం మహిళలు పనిచేయడానికి ఇష్టపడే టాప్ 10 రాష్ట్రాలు
మహిళలను ఎక్కువగా ఆకర్షించే రాష్ట్రాలు సాధారణంగా మెరుగైన భద్రత, మౌలిక సదుపాయాలు, కెరీర్ పురోగతికి అవకాశాలను అందిస్తున్నాయి… లింగ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యాపార సంస్థలకు ఈ సమాచారం చాలా ముఖ్యం. నియామక పద్ధతులను మెరుగుపరచడానికి, మహిళలకు మద్దతు ఇచ్చే, సాధికారత కల్పించే పని వాతావరణ విధానాలను రూపొందించడానికి వీబాక్స్ నివేదిక మార్గనిర్దేశం చేస్తుంది. దీని ద్వారా కంపెనీలు అందరినీ కలుపుకొనిపోయే, స్వాగతించే కార్యస్థలాన్ని సృష్టించగలవు.
55
మహిళల కేరీర్ ప్లానింగ్
వీబాక్స్ నివేదిక కేవలం మహిళల ఉద్యోగ సామర్థ్యం గురించి తెలియజేయడమేకాదు... ఇది విద్య, అవకాశాలు, సహాయక పని వాతావరణం లభ్యతను ప్రతిబింబిస్తుంది. తమ కెరీర్‌ను ప్లాన్ చేసుకునే మహిళలకు, ఏ ప్రాంతాలు కెరీర్ వృద్ధికి అత్యంత అనుకూలమైనవో తెలుసుకోవడం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అవసరం. సురక్షితమైన, మంచి పని వాతావరణాన్ని అందించే ప్రాంతాలు, మహిళా ఉద్యోగుల భాగస్వామ్య రేటులో అధిక వృద్ధిని చూస్తాయని ఈ వీబాక్స్ నివేదిక నొక్కి చెబుతోంది.