టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి..? ఏపీలో అత్యధికం, అత్యల్పం ఎక్కడ, ఎంతో తెలుసా..?

Published : Feb 09, 2026, 05:59 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో చిన్న వయసులోనే అమ్మాయిలు గర్భం దాలుస్తున్న కేసులు పెరిగిపోతున్నాయి. అత్యధిక టీనేజీ ప్రెగ్నెన్సీలు సీఎం చంద్రబాబు నాయుడు ఇలాకా కుప్పంలో నమోదవుతున్నాయట. మరి అత్యల్పం ఎక్కడో తెలుసా..?   

PREV
15
పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వే 2025-26

Teenage pregnancy : భారతదేశంలో మహిళల కనీస వివాహ వయస్సు 18 ఏళ్ళు... దీన్ని పురుషులతో సమానంగా 21 ఏళ్ళకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇలా పెళ్లి వయసును పెంచాలనే ఆలోచనకు మహిళల ఆరోగ్యమే ప్రధాన కారణం. చిన్న వయసులో పెళ్లి కారణంగా మహిళలు గర్భం దాలుస్తున్నారు.. దీంతో తల్లి, శిశువుకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి, మరణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే కేంద్రం కనీస వివాహ వయసు పెంచాలనుకుంటోంది...  అంటే టీనేజీ ప్రెగ్నెన్సీని తగ్గించాలనుకుంటోంది.

అయితే ఆంధ్ర ప్రదేశ్ ను 'టీనేజీ ప్రెగ్నెన్సీ' కంగారు పెడుతోంది. తాజాగా ప్రభుత్వం నిర్వహించిన 'పాపులేషన్ మేనేజ్మెంట్' సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో టీనేజీ ప్రెగ్నెన్సీ రోజురోజుకు పెరుగుతోందని... కొన్ని జిల్లాల్లో 10 శాతానికి పైగానే ఉందని తేలింది. ఈ క్రమంలో అసలు టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి..? ఏపీలో ఎక్కడ ఎక్కువ ఉంది? ఎక్కడ తక్కువగా ఉంది..? తెలుసుకుందాం.

25
అసలు ఏమిటీ టీనేజీ ప్రెగ్నెన్సీ..?

ప్రస్తుతం మహిళల కనీస వివాహ వయస్సు 18 ఏళ్ళు... అంటే పెళ్లయిన ఏడాదికే పిల్లలు పుడతారని అనుకున్నా కనీస గర్భధారణ వయసు 19 ఏళ్లు. ఇంతకంటే ఎక్కువ వయసుండే మహిళలకే గర్భం, పిల్లలను కనడం సేఫ్... తక్కువ వయసుంటే ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. కాబట్టి 19 ఏళ్లకంటే తక్కువ వయసున్న మహిళలు గర్భం దాలిస్తే దానిని 'టీనేజీ ప్రెగ్నెన్సీ' అంటారు.

35
ఏపీలో పెరిగిన టీనేజీ ప్రెగ్నెన్సీ..

ఆంధ్ర ప్రదేశ్ లో టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే చిన్న వయసులో గర్భందాల్చే అమ్మాయిల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ విషయం ప్రభుత్వం చేపట్టిన పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వే 2025-26 లో బైటపడింది. రాష్ట్రంలో 8.8 శాతం టీనేజీ ప్రెగ్నెన్సీ నమోదయ్యింది. ఈ సర్వే వివరాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు.

45
చంద్రబాబు ఇలాకాలోనే అత్యధికం...

ఏపీ పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వే 2025-26 ప్రకారం కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా టీనేజ్ అమ్మాయిలు గర్భం దాలుస్తున్నారు. ఇక్కడ టీనేజీ ప్రెగ్నెన్సీ రేటు 14.9 శాతంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో కుప్పంలో ఈ స్థాయిలో టీనేజీ ప్రెగ్నెన్సీ రేటు ఉండటం ఆశ్చర్యకరం. అంటే ఈ నియోజకవర్గంలో బాల్య వివాహాలు జరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఉండటం ఆందోళనకరం. అందుకే కుప్పంలో టీనేజీ ప్రెగ్నెన్సీలు తగ్గించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు... బాల్య వివాహాలపై కఠినంగా వ్యవహరించనున్నారు.

55
ఏ జిల్లాలో అత్యల్ప టీనేజీ ప్రెగ్నెన్సీ...

అత్యధిక టీనేజీ ప్రెగ్నెన్సీ కుప్పంలో అయితే అత్యల్పం మాత్రం విశాఖపట్నంలో. ఇక్కడ కేవలం 3.98 శాతం టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదవుతున్నాయట. రాష్ట్రం మొత్తం కూడా వైజాగ్ తరహాలో అత్యల్ప టీనేజీ ప్రెగ్నెన్సీ ఉండేలా చూడటమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

కర్నూల్, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో టీనేజీ ప్రెగ్నెన్సీ 12 శాతంగా ఉంది. అలాగే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, ఏలూరు, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో 10 నుండి 12 శాతం ఉంది. కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి, గుంటూరు జిల్లాల్లో 8 నుండి 10 శాతం టీనేజీ ప్రెగ్నెన్సీ ఉంది. మిగతా జిల్లాల్లో తక్కువగానే టీనేజీ ప్రెగ్నెన్సీ ఉందని పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వే బైటపెట్టింది.

Read more Photos on
click me!

Recommended Stories