1. ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు, ఈగలు వంటివి ఇంట్లోకి రాకుండా జాగ్రత్తపడాలి. ఇలా చేశారంటే స్క్రబ్ టైపస్ వ్యాధికారక కీటకం కూడా ఇంట్లోకి చేరదు.
2. గ్రామీణ ప్రాంతాల్లో స్క్రబ్ టైపస్ ను వ్యాప్తిచేసే కీటకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పశువులు, ఇతర జీవాలుండే ప్రాంతాలు, పొలాలు, గడ్డివాముల వద్ద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు, రైతు కూలీలు ఈ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి.
3. పిల్లల్లో ఈ స్క్రబ్ టైపస్ వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వారి శరీరాన్ని పూర్తిగా కప్పివుంచే దుస్తులు వేయాలి. అలాగే పిల్లలు నిద్రించే సమయంలో ఎలాంటి కీటకాలు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
4. పట్టణాల్లో ఇంటి ఆవరణలోనే మొక్కలు పెంచుతుంటాయి... ఇలాంటి ఇళ్లలో కుండీల చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే అపరిశుభ్ర వాతావరణ ఏర్పడి కీటకాలు పెరుగుతాయి.
5. నదులు, వాగులు వంకలు, చెరువులు వంటి నీటిప్రవాహాల తీరప్రాంతాల్లో ఈ చిగ్గర్ మైట్ కీటకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.