నేడు (ఆగస్ట్ 29, శనివారం) తెలంగాణలో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, కొమ్రంబీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చెదురుమదురు జల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే భారీ వర్షాలేమీ ఉండవని పేర్కొంది.
ఇక హైదరబాద్ తో పాటు మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనూ నేడు చెదురుమదురు జల్లులు పడే అవకాశాలు ఉన్నాయంటోంది. ఉదయం, మధ్యాహ్నం పొడి వాతావరణమే ఉంటుంది... సాయంత్రం, రాత్రి సమయంలో జల్లులు మొదలయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్ర తెలిపింది.