IMD Alert : ఈ తెలుగు జిల్లాలకు హైఅలర్ట్.. జారీచేసిన తుపాను హెచ్చరికల కేంద్రం

Published : Jan 20, 2026, 07:52 AM IST

Andhra Pradesh And Telangana Weather :  తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం చలి తగ్గిన దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

PREV
16
తెలుగు రాష్ట్రాలకు అలర్ట్..

IMD Cold Waves : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సాధారణ శీతాకాల ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి... చలి తీవ్రత తగ్గింది. జనవరి 2026 ముగిసేవరకు వర్షాలు కూడా కురిసే అవకాశాలు లేవని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం విపరీతమైన పొగమంచు కురుస్తోంది. తెల్లవారుజామున దట్టంగా కురుస్తున్న పొగమంచుతో విజిబిలిటీ భారీగా తగ్గింది... కేవలం 200-300 మీటర్ల దూరంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి చాలాప్రాంతాల్లో ఉంది.

26
ఏపీలో దట్టమైన పొగమంచు

ఆంధ్ర ప్రదేశ్ లో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసే స్థాయిలో పొగమంచు కురుస్తోంది. ముఖ్యంగా కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్డీఆర్, బాపట్ల, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కృష్ణా, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఈ పొగమంచు కారణంగా గన్నవరం విమానాశ్రయంలో సోమవారం ఉదయం పలు విమానాలు రద్దయ్యాయి… దీన్నిబట్టే ఏ స్థాయిలో కురుస్తుందో అర్థంచేసుకోవచ్చు.  

36
ఈ తెలంగాణ జిల్లాల్లో బిఅలర్ట్...

ఇక తెలంగాణలోనూ చలి తగ్గినా పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఈస్ట్ తెలంగాణ జిల్లాల్లో దట్టమైన పొగమంచు పరిస్థితులు ఉన్నాయని... ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాబ్, ములుగు, హన్మకొండ, జనగాం, సూర్యాపేట జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని వెదర్ మ్యాన్ తెలిపారు. రాబోయే నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది... పొగమంచు వల్ల విజిబిలిటి తగ్గి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుందికాబట్టి వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తెలంగాణ వెదర్ మ్యాన్.

46
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే..

తెలంగాణలో ఉష్ణోగ్రతలు మెల్లిగా పెరుగుతున్నాయి... దీంతో చలితీవ్రత తగ్గుతోంది. నిన్న(జనవరి 19, సోమవారం) మెదక్ లలో 12.2, ఆదిలాబాద్ లో 12.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హన్మకొండలో 11.5, రామగుండంలో 13.5, నిజామాబాద్ లో 15.5, మహబూబ్ నగర్ లో 16.1, నల్గొండలో 17, ఖమ్మంలో 17.4, భద్రాచలంలో 18.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మహబూబ్ నగర్ లో 34.4 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది.

56
హైదరాబాద్ ఉష్ణోగ్రతలు

హైదరాబాద్ విషయానికి వస్తే అత్యల్పంగా రాజేంద్ర నగర్ లో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పటాన్ చెరు ఈక్రిశాట్ పరిసరాల్లో 13, హకీంపేటలో 14.9, హయత్ నగర్ లో 15.6, బేగంపేటలో 16.4, దుండిగల్ లో 16.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.

66
రాబోయే రోజుల్లో తెలంగాణ వెదర్..

రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీలు తగ్గే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 11 నుండి 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. హైదరాబాద్ తో పాటు మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఈ ఉష్ణోగ్రతలే ఉంటాయని హెచ్చరించింది. మిగతా అన్ని జిల్లాల్లోనూ 15 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Read more Photos on
click me!

Recommended Stories