Weather Update: తుపాను అలర్ట్.. ఏపీ, తెలంగాణకు రానున్న మూడు రోజులు భారీ వర్షాలు

Published : Oct 21, 2026, 07:37 AM IST

Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉంది. రానున్న రోజుల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారి తీరందాటే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

PREV
15
బంగాళాఖాతంలో బలపడుతున్న ఆవర్తనం

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరానికి ఆనుకుని సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా కూల్ అయింది.

మరోవైపు అండమాన్ సముద్ర ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు మారుతుండటంతో, త్వరలోనే అక్కడ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారి, మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఈ నెలాఖరు నాటికి ఇది తుపానుగా రూపాంతరం చెంది, ఉత్తర కోస్తాంధ్ర - దక్షిణ ఒడిశా తీరాల మధ్య తీరం దాటే సూచనలున్నట్లు ప్రాథమిక అంచనా.

25
కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు.. మత్స్యకారులకు హెచ్చరికలు

సముద్రం నుంచి వీస్తున్న తేమ గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంతాల్లో వాతావరణం మారిపోయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షపు జల్లులు పడే వీలుంది.

తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఇక పోలవరం, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

35
తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాల మోత

తెలంగాణ రాష్ట్రంలోనూ రానున్న మూడు రోజుల పాటు వాతావరణం మారనుంది. కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రైతులు అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

45
గ్రేటర్ హైదరాబాద్‌లో వాతావరణ ఎలా ఉండనుంది?

హైదరాబాద్ నగరంలో ఉదయం వేళ వాతావరణం ఆహ్లాదకరంగానే ఉన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్ముకునే అవకాశముంది. నగరంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపు జల్లులు కురిసే వీలుంది.

నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31 నుంచి 32 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. వర్షం సమయంలో ప్రధాన రహదారులపై నీరు నిలిచి ట్రాఫిక్ నెమ్మదించే ప్రమాదం ఉన్నందున వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.

55
రైతులకు, ప్రజలకు అత్యవసర సూచనలు

రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో పగటి పూట ఉక్కపోత ఎక్కువగా ఉన్నప్పటికీ, సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు, రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల దగ్గర గానీ నిలబడవద్దని అధికారులు హెచ్చరించారు.

Read more Photos on
click me!

Recommended Stories