తెలంగాణలో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్,కొమురంభీమ్,మంచిర్యాల,నిర్మల్,కామారెడ్డి మెదక్ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో ఈ జిల్లాల ప్రజలు మధ్యాహ్నం వేళ అస్సలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు. జగిత్యాల,కరీంనగర్,నిజామాబాద్,పెద్దపల్లి.. సిరిసిల్ల జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. దీంతో ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.
ఉత్తరాది రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్‌లలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని తెలిపింది. రెండు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వివరించింది. మరో ఆరు రోజులపాటు వడగాలులు ఉంటాయని హెచ్చరించింది.