రూపాయికే అర‌కిలో చికెన్‌.. ఒక్క‌సారిగా ఎగ‌బ‌డుతోన్న జ‌నం. ఎక్క‌డంటే..

Published : Nov 22, 2025, 01:18 PM IST

Viral News: ప్ర‌స్తుతం కిలో చికెన్ ధ‌ర సుమారు రూ. 200 వ‌ర‌కు ఉంది. అయితే రూపాయికి కిలో చికెన్ ల‌భిస్తే ఎలా ఉంటుంది.? ఊహించుకోవ‌డానికి వింత‌గా ఉన్నా ఏపీకి చెందిన ఓ చికెన్ షాప్ ఓన‌ర్ నిజంగానే రూపాయికే అర కిలో చికెన్ అందిస్తున్నాడు. 

PREV
14
రూపాయికి అర కిలో చికెన్

విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఒక చికెన్ షాప్ ఓన‌ర్‌ వినూత్న ఆఫర్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. రూపాయికే అర‌కిలో చికెన్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టిస్తూ షాప్ ముందు బోర్డును ఏర్పాటు చేశాడు. దీంతో జ‌నాలు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. అయితే పాత రూపాయి నోటును ఇవ్వాల్సి ఉంటుంద‌ని షాపు య‌జ‌మాని పేర్కొన్నాడు. ఈ ఆఫర్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజ‌న్లు పెద్ద ఎత్తున చ‌ర్చించుకుంటున్నారు.

24
చికెన్ రేట్లు పెర‌గ‌డంతో..

చికెన్ ప్రేమికులకు ఆదివారం అంటే ఫెస్టివల్‌లాంటిదే. కాని ఇటీవలి కాలంలో చికెన్ ధరలు పెరగడంతో చాలామందికి కొనడం కష్టమైంది. కార్తీక మాసం ముగిసిన నేప‌థ్యంలో చికెన్‌కు డ‌మాండ్ పెరిగింది. అయితే ఇలాంటి స‌మ‌యంలో రూపాయికే చికెన్ అనే ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌జ‌లు త‌మ వ‌ద్ద ఉన్న పాత రూపాయి నోట్ల‌ను తీసుకొని దుకాణానికి త‌ర‌లి వ‌స్తున్నారు.

34
ఒక్కొక్క‌రు 6 నుంచి 10 నోట్లు

ఆఫర్ చూసి ఆశ్చర్యపోయిన చాలామంది ఉదయం 8 గంటలకే షాపు ముందు లైన్లో నిలబడ్డారు. కొందరు ఇంట్లో ఉన్న పాత నోట్లను తెచ్చారు. ఈ విష‌య‌మై షాప్ య‌జమాని మాట్లాడుతూ.. ‘‘ఒక్కొక్కరికి ఒక ప్యాకెట్ ఇస్తామనుకున్నా… కొందరు 6 నుంచి 10పాత నోట్లు తెచ్చి చాలానే చికెన్ తీసుకెళ్లారు.’’ ఒక్కరోజులోనే 100కు పైగా పాత రూపాయి నోట్లు తన దగ్గరకు వచ్చాయని చెప్పాడు.

44
అస‌లు ఉద్దేశం ఏంటి.?

ప్రారంభంలో ప్రజలు ఇది వ్యాపార ప్రచారం కోసం చేశారని అనుకున్నారు. కాని షాప్‌ యజమాని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “ఈ ఆఫర్ నా వ్యాపారం కోసం కాదు. పాత ఒక రూపాయి నోట్లతో ఆర్ట్ క్రాఫ్ట్స్ తయారు చేయాలనుకున్నాను. అందుకే ఇలాంటి ప్రత్యేక ఆఫర్ పెట్టాను.” అని చెప్పుకొచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories