ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తీ కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌లు.. మ‌రో ప‌థ‌కానికి సిద్ధ‌మ‌వుతోన్న కూట‌మి ప్ర‌భుత్వం

Published : Nov 22, 2025, 09:52 AM IST

Andhra Pradesh: ఏపీ ప్ర‌భుత్వం మ‌రో ప‌థకం అమ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ప్రజలకు సమగ్ర ఆరోగ్య భద్రత కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి రాబోతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 

PREV
15
యూనివ‌ర్స‌ల్ హెల్త్ కవర్

ప్రభుత్వ నిర్ణయంతో దారిద్య్ర రేఖ కింద (BPL) నమోదు అయిన కుటుంబాలు ప్రతీ ఏడాది రూ.25 లక్షల వరకు ఆరోగ్య సేవలను నగదు రహితంగా పొందగలవు. ఆర్థికంగా స్థిరమైన (APL) కుటుంబాలకు ఏడాదికి రూ.2.5 లక్షల వరకు వైద్య చికిత్స ఉచితంగా లభించనుంది. దీంతో క్యాన్సర్‌, గుండె సంబంధిత శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్య సేవలు వంటి అధిక ఖర్చు చేసే చికిత్సలు కూడా క‌వ‌ర్ అవుతాయి. ప్ర‌జ‌ల ఆదాంయ ఎంతైనా ఆరోగ్య హ‌క్కు అంద‌రికీ స‌మాన‌మే అని చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు.

25
పీపీపీ మోడల్‌పై స్పందించిన చంద్ర‌బాబు

మెరుగైన ఆరోగ్య మౌలిక వసతుల కోసం పీపీపీ (పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పద్ధతిలో కొత్త వైద్య కళాశాలలను నిర్మిస్తున్నామ‌ని సీఎం తెలిపారు. ఈ ఆసుపత్రుల్లో 70% పడకలు పూర్తిగా ఉచిత సేవల కోసం కేటాయిస్తామ‌ని పేర్కొన్నారు. మొదటి దశలో ఆదోని, పులివెందుల, మదనపల్లె, మార్కాపురం అమ‌లు చేయ‌నున్న‌ట్లు చెప్పుకొచ్చారు. ప్రతి కళాశాల కోసం 50 ఎకరాల భూమి కేటాయించగా, అందులో 25 ఎకరాల్లో మెడికల్ కాలేజ్ ఆసుపత్రి, మిగిలిన ప్రాంతంలో నర్సింగ్‌, ఆయుర్వేదం, డెంటల్‌, పారామెడికల్‌, వెల్‌నెస్‌తో పాటు యోగా కేంద్రాలు ఏర్పాటు చేయ‌నున్నారు.

35
‘సంజీవని’ మోడల్: డిజిటల్ హెల్త్ విప్లవం

కుప్పం ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సంజీవని పథకం రాష్ట్రానికి గేమ్‌చేంజర్‌గా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి వ్యక్తికి డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేసి పూర్తి వైద్య చరిత్రను ఆన్‌లైన్‌లో భద్రపరుస్తారు. ఇందులో ఇప్పటివరకు 3.38 లక్షల మంది ఆరోగ్య సమాచారం నమోదైంది. 49 వేల మంది రోగుల డిజిటల్ డేటా సిద్ధమైంది. 2026 జనవరి నుంచి ఈ ప్రాజెక్టును చిత్తూరు జిల్లా మొత్తం మీద అమలు చేయనున్నారు.

45
ప్ర‌త్యేక యాక్ష‌న్ ప్లాన్

రాష్ట్రంలో వ్యాధుల ప్రబలింపు, ప్రాంతాల వారీగా వైద్య అవసరాలు, ఆరోగ్య ఖర్చులపై డేటా విశ్లేషణకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్రివెంటివ్, క్యురేటివ్ వైద్య విధానాలను సమాంతరంగా అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆరోగ్య సేవల ద్వారా నెలకు రూ.330 కోట్ల విలువైన క్లెయిమ్‌లు వస్తున్నట్లు అధికారులు చెప్పారు.

55
రేటింగ్ వ్యవస్థ

ఆరోగ్య సంస్థల పనితీరును నీతి ఆయోగ్ ప్రమాణాల ఆధారంగా రేటింగ్ చేయాలని సీఎం సూచించారు. సేవల నాణ్యత, పారదర్శకత, వైద్య సిబ్బంది అందుబాటు, పేషెంట్ సంతృప్తి వంటి అంశాలు రేటింగ్‌కు ప్రమాణాలుగా ఉండనున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories