ఇంతకీ ఏం జరిగిందంటే.?
అలేఖ్య చిట్టి పికెల్స్ ధరలను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ మెసేజ్ చేశాడు. కిలో చికెన్ పికిల్ ధర రూ. 1200 ఉందని, చేతులు జోడించిన ఎమోజీ పెట్టి, మరీ ఇంత ఎక్కువ ధరా.? అంటూ ఓ మెసేజ్ చేశాడు. ఈ మెసేజ్‌కు అలేఖ్య పికెల్స్ నుంచి కస్టమర్‌ను కించపరిచేలా ఉన్నట్లు ఉన్న ఓ ఆడియో వైరల్ అవుతోంది. పికిల్స్ కొనే స్థోమత లేని నువ్వు భవిష్యత్తులో పెళ్లి చేసుకోకు అంటూ వాయిస్ మెసేజ్‌లో ఉంది. అయితే అక్కడితో ఆగకుండా రాయడానికి కూడా వీలుకాని భాషలో దూషిస్తున్నట్లు ఆడియోలో ఉంది.
ఫైర్ అవుతోన్న నెటిజన్లు
వైరల్ అవుతోన్న ఈ వాయిస్ మెసేజ్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కస్టమర్ వినయంగా ప్రశ్నిస్తే, అంత దారుణంగా మాట్లాడడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు ట్రోలింగ్ ఎక్కువయ్యే సరికి అలేఖ్య చిట్టి పికెల్స్ ఫోన్ నెంబర్ ను తాత్కాలింకంగా నిలిపివేశారు. అటు వాట్సాప్ అకౌంట్ ను కూడా డిలీట్ చేశారు. ఇన్ స్టాలో కూడా ఓపెన్ అవ్వడం లేదు. ప్రస్తుతం వెబ్ సైట్ కూడా ఓపెన్ కావడం లేదు. మంచి అవకాశాన్ని వినియోగించుకోకుండా ఇలా ఓవర్ యాక్షన్ చేయడం ఏంటంటూ నిందిస్తున్నారు.