కలియుగ దైవం తిరులమ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం టీటీడీ ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమలలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఉచితంగా తిరుగనున్నాయి. భక్తులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఈ బస్సుల్లో ఏ చార్జీ లేకుండా ప్రయాణించవచ్చు. ఈ సేవలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారికంగా ప్రారంభించారు. ఇది తిరుమలలో భక్తులకు తిరగడానికి సులభతరం చేస్తుంది.
26
ప్రైవేటు వాహనాలకు చెక్
తిరుమలలో గత కొంతకాలంగా ప్రైవేటు వాహనాలు భక్తుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయని పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయి. దాంతోపాటు ఈ వాహనాల వల్ల వాతావరణ కాలుష్యం కూడా పెరిగిపోతోంది.
ఈ సమస్యల పరిష్కారంగా టీటీడీ, APSRTC ఉచిత బస్సు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. దీనివల్ల భక్తులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోతుంది.
36
శ్రీవారి ధర్మరథాల మాదిరిగా ఎప్పటికప్పుడు ట్రిప్పులు
ప్రస్తుతం తిరుమలలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మరథాల ద్వారా రోజుకు సుమారు 300 ట్రిప్పులు నడుస్తున్నాయి. ఇప్పుడు APSRTC బస్సులు కూడా కలవడం వల్ల అదనంగా రోజూ 80 ట్రిప్పులు నడిపే అవకాశం ఏర్పడింది. ఈ బస్సులు ప్రతి రెండు నిమిషాలకు ఒకటి ఉండేలా షెడ్యూల్ ఏర్పాటు చేశారు. తక్కువ గ్యాప్‌తో ఎక్కువ బస్సులు తిరగడం వల్ల భక్తుల రద్దీ సమస్య కొంత మేరకు తగ్గుతుంది.
ఈ ఉచిత బస్సులు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ భక్తులను సజావుగా తిరుపతి చేరవేస్తాయి. భక్తులు ప్రత్యేకంగా బస్టాండ్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా సమీప ప్రాంతాల నుంచే APSRTC బస్సుల్లో ఎక్కవచ్చు. తిరుమలలో ఎక్కడి నుంచి ఎక్కినా తిరుపతికి మాత్రమే చార్జీలు వసూలు చేస్తారు. తిరుమలలో బస్సుల ప్రయాణం పూర్తిగా ఉచితమే. అదనపు చార్జీలు లేవు అని టీటీడీ ప్రకటించింది.
56
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
వీకెండ్ కావడంతో తిరుమల భక్తుల రద్దీ పెరిగింది. ఉచిత సర్వదర్శన క్యూలైన్లు శిలాతోరణం వరకూ విస్తరించాయి. ప్రస్తుతం ఉచిత దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ (SSD) ద్వారా దర్శనానికి 7 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు సమయం అవసరం అవుతోంది.
66
శనివారం ఎంతమంది దర్శించుకున్నారంటే
శనివారం ఒకే రోజులో తిరుమలలో స్వామివారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య 90,087 మందిగా నమోదు అయింది. అదే రోజు తలనీలాలు సమర్పించిన భక్తులు 41,891 మంది. హుండీ ద్వారా వచ్చిన ఆదాయం రూ. 4.30 కోట్లు.