Food Testing Lab in Tirumala: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.86 కోట్లతో 5 రాష్ట్రస్థాయి ఆహార నాణ్యతా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలలో భారీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.
2024 ఏప్రిల్‌లో తిరుమలలోని ప్రసాదం తయారీలో ఉపయోగించిన పదార్థాల్లో కల్తీ నెయ్యి కలిపినట్లు ఆరోపణలు వచ్చాయి. భక్తుల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటన తర్వాత భక్తుల్లో విశ్వాసం దెబ్బతింది. అప్పటి ప్రభుత్వంపై నిర్లక్ష్యం ఆరోపణలు వచ్చాయి.
దీనికి పరిష్కారంగా, ఆహార నాణ్యతను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ల్యాబ్ ద్వారా ప్రసాదం, అన్నప్రసాదం, టీ, పాలు, నెయ్యి వంటి పదార్థాలు క్రమం తప్పకుండా పరీక్షించనున్నారు. వచ్చె నెల తిరుమలలో ఈ ల్యాబ్ ప్రారంభం కానుంది.
DID YOU KNOW ?
తిరుపతి లడ్డూ
తిరుమల లడ్డూ 1740లలో ప్రారంభమై, 1933లో TTD ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రసాదంగా మారింది. నేడు రోజుకు లక్షల లడ్డూలు తయారవుతున్నాయి.
25
ఏపీలో 5 రాష్ట్రస్థాయి ఆహార నాణ్యతా పరీక్షా కేంద్రాలు
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తాజాగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ వివరాలు వెల్లడించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.86 కోట్ల వ్యయంతో 5 రాష్ట్రస్థాయి ఆహార నాణ్యతా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు సుమారు రూ.20 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. ఈ ల్యాబ్‌లలో ఆధునిక పరికరాల సాయంతో ఆహార పదార్థాల నమూనాలు పరీక్షిస్తారని వివరించారు.
35
తుదిదశకు తిరుమలలో ప్రత్యేక రాష్ట్ర స్థాయి ల్యాబ్ పనులు
తిరుమలలో భక్తుల కోసం ప్రత్యేక రాష్ట్ర స్థాయి ఫుడ్ ల్యాబొరేటరీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏప్రిల్‌లో ప్రారంభమైన పనులు తుదిదశకు చేరుకున్నాయి. వచ్చే నెలాఖరుకల్లా వినియోగానికి సిద్ధం చేయాలని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ నెయ్యి ఘటన భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని, ఆ నేపథ్యంలో ఈ ల్యాబ్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
తిరుమల పిండి మిల్లు సమీపంలోని 12,000 చదరపు అడుగుల భవనాన్ని ల్యాబ్‌గా మారుస్తున్నారు. రూ.19 కోట్ల వ్యయంతో అత్యాధునిక యంత్ర పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ల్యాబ్‌లో అన్ని రకాల ఆహార పదార్థాల నమూనాలు 24 గంటలు పరీక్షిస్తారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల ఆరోగ్య రక్షణే ప్రధాన లక్ష్యం అని మంత్రి స్పష్టం చేశారు.
55
విశాఖ, గుంటూరు, తిరుపతి, కర్నూలులలో ల్యాబ్ లు
విశాఖపట్నంలోని రాష్ట్ర స్థాయి ఫుడ్ ల్యాబొరేటరీ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. గుంటూరు జీజీహెచ్, తిరుపతిలో రాష్ట్ర స్థాయి ల్యాబ్‌లు ఏర్పాటుకు పనులు కొనసాగుతున్నాయి. కర్నూలులో ఉన్న ప్రాంతీయ ఫుడ్ ల్యాబ్‌ను ఉన్న అధునీకరించేందుకు కొత్త భవనం నిర్మించనున్నారు. భవనం కోసం స్థల ఎంపిక జరుగుతోంది.
ఒంగోలు, ఏలూరు ల్యాబ్‌ల ఆధునీకరణ
ఒంగోలు, ఏలూరులోని పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను రూ.13 కోట్ల వ్యయంతో ఆధునీకరిస్తున్నారు. అత్యాధునిక పరికరాల కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి పర్చేజింగ్ ఆర్డర్ జారీ చేశారు. దీంతో త్వరలో ఈ ల్యాబ్‌లు కూడా మెరుగైన సదుపాయాలతో పనిచేయనున్నాయి.