ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అందుబాటులోకి వచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకాన్ని సులభంగా గుర్తించేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులపై ప్రత్యేక స్టిక్కర్లు అమర్చుతున్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు వంటి ఆకుపచ్చ రంగు బస్సులు సులువుగా గుర్తుపట్టవచ్చు. కానీ ఎక్స్‌ప్రెస్, నాన్‌స్టాప్, ఇంటర్‌స్టేట్ ఎక్స్‌ప్రెస్ బస్సులు రూపంలో ఒకేలా ఉండటం వల్ల ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ సమస్య నివారణకు ఉచిత ప్రయాణం వర్తించే ఎక్స్‌ప్రెస్ బస్సులపై ‘స్త్రీ శక్తి పథకం’ స్టిక్కర్లు అతికించి స్పష్టతనిస్తున్నారు. నాన్‌స్టాప్, ఇంటర్‌స్టేట్ బస్సుల్లో మాత్రం మహిళలు టికెట్ కొనుగోలు చేయాల్సిందే.
DID YOU KNOW ?
5 రకాల బస్సుల్లో
స్త్రీ శక్తి పథకంలో భాగంగా 5 రకాల బస్సుల్లో మహిళలకు జీరో ఫేర్ టికెట్లు ఇస్తారు.
25
జీరో ఫేర్ టికెట్ల జారీ విధానం
స్త్రీ శక్తి పథకంలో భాగంగా 5 రకాల బస్సుల్లో మహిళలకు జీరో ఫేర్ టికెట్లు ఇస్తారు. అయితే ఇప్పటికే విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు వంటి వారు నెలవారీ లేదా సీజనల్ పాస్‌లు కలిగి ఉంటే, ఆ పాస్ గడువు ముగిసే వరకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వరు. పాస్ గడువు పూర్తైన తర్వాతే ఉచిత టికెట్లు జారీ చేస్తారు.
35
డ్రైవర్లు–కండక్టర్లకు అదనపు చెల్లింపులు
ఉచిత బస్సు పథకం అమలుతో డ్రైవర్లు, కండక్టర్లపై పని భారం పెరగనుంది. ఈ నేపథ్యంలో డబుల్ డ్యూటీకి చెల్లింపులు పెంచారు. ఇప్పటివరకు రెగ్యులర్ డ్రైవర్లకు రూ.800, కండక్టర్లకు రూ.700 ఇచ్చేవారు. ఇకపై డ్రైవర్లకు రూ.1,000, కండక్టర్లకు రూ.900 చెల్లిస్తారు. అలాగే ఆన్‌కాల్ డ్రైవర్లకు రోజువారీ రూ.800 నుంచి రూ.1,000కి పెంచారు.
ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పథకంపై అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మహిళా ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. ముఖ్యమంత్రి అధికారికంగా పథకాన్ని ప్రారంభించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా జీరో ఫేర్ టికెట్ల జారీ ప్రారంభమవుతుందని తెలిపారు.
55
పథకం ప్రయోజనాలు
ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా 5 కేటగిరీల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. వీటిలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి. జీరో ఫేర్ టికెట్ పొందేందుకు ఆధార్, ఓటరు ఐడి, రేషన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు చూపించాల్సి ఉంటుంది.