ఇదిలావుంటే రుషికొండపై లక్షా 41వేలకు పైగా చదరపు అడుగుల్లో అత్యంత విలాసవంతమైన భవనాలు నిర్మించారు. కళింగ, గజపతి, వెంగి పేరిట మూడు బ్లాకులు వున్నాయి. విశాలమైన కారిడార్లు, విలాసవంతమైన గదులు, కళ్లుచెదిరే ఫర్నీచర్ తో ఈ భవనాలు అత్యంత ఖరీదైనవిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ భవనాల్లోని బాత్రూంలు పేద, మధ్య తరగతి కుటుంబాల నివాసాల కంటే ఎక్కువ ఖర్చుతో నిర్మించారని... ఒక్కోటి దాదాపు 500 చదరపు అడుగుల వైశాల్యంలో వున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంగారు రంగు షవర్లు, కుళాయిలు, లక్షల విలువైన బాత్ టబ్ తో కూడిన బాత్రూం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.