డిప్యూటీ సీఎం తాలూకా ఫ్యాన్స్ కోరుకునేది ఇదేగా... పవన్ కు ఎంతటి గౌరవం దక్కింది...

First Published Jun 18, 2024, 7:46 PM IST

ఆంధ్ర ప్రదేశ్ సచివాలయానికి మొదటిసారి విచ్చేసిన పవన్ కల్యాణ్ కు అపూర్వ స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ నాయకుడు పవన్ పై చూపించిన ఆత్మీయతకు జనసైనికులు, మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Chandrababu Pawan

అమరావతి : కలిసికట్టుగా పనిచేస్తే ఏదయినా సాధించవచ్చని నిరూపించారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్. బలమైన శత్రువును వేరువేరుగా ఎదుర్కోవడం వల్ల కలిగే నష్టమేమిటో 2019 ఎన్నికల్లో చూసారు... కానీ 2024 లో ఆ తప్పు చేయకుండా కలిసికట్టుగా పోటీచేసి వైఎస్ జగన్ ను చిత్తుచిత్తుగా ఓడించారు. 175కు గాను 164 సీట్లు సాధించిన టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది... నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసారు. 
 

Chandrababu Pawan


అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ ల మధ్య కేవలం రాజకీయంగానే కాదు ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. ఇద్దరు నేతలు ఈగోలను పక్కనబెట్టి ఒకరి గొప్పతనాన్ని ఒకరు గుర్తించారు... తగిన గౌరవం ఇచ్చిపుచ్చుకున్నారు. ఇదే ఆత్మీయ అనుబంధాన్ని ఎన్నికల్లో విజయం తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్  సచివాలయం చంద్రబాబు, పవన్ ఆత్మీయ సమావేశానికి వేదికయ్యింది.  

Latest Videos


Chandrababu Pawan

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు(బుధవారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ అమరావతిలోని సెక్రటేరియట్ కు వెళ్లారు పవన్... రెండో బ్లాక్ లో తనకు కేటాయించిన చాంబర్ ను పరిశీలించారు. అనంతరం పవన్ ముఖ్యమంత్రి చాంబర్ కు వెళ్లగా అక్కడ టిడిపి, జనసేన శ్రేణులను ఖుషీ చేసే దృశ్యం ఆవిషృతం అయ్యింది. 

Chandrababu Pawan

పవన్ కు చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం : 

ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ పలుమార్లు భేటీ అయ్యారు. కానీ సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్  సచివాలయంలో భేటీ కావడం ఇదే తొలిసారి. అసలు పవన్ కల్యాణ్ సెక్రటేరియట్ కు రావడం ఇదే తొలిసారి. దీంతో పవన్ కు అధికారులు సాదర స్వాగతం పలకగా చంద్రబాబు ఎంతో గౌరవంతో చూసుకున్నారు.

Chandrababu Pawan

ముఖ్యమంత్రి చాంబర్ లోకి పవన్ ఎంట్రీ ఇవ్వగానే చంద్రబాబు తన సీటులోంచి లేచొచ్చారు. పవన్ కు ఎదురెళ్లి కరచాలనం చేసి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇలా చంద్రబాబు, పవన్ ఆలింగనం అక్కడున్నవారినే కాదు టిడిపి, జనసేన శ్రేణులను ఆకట్టుకుంది. అనంతరం పవన్ కు పుష్పగుచ్చం ఇచ్చి దగ్గరుండి మరీ తన చాంబర్ ను చూపించారు చంద్రబాబు. 

Pawan Kalyan

ఇక సీఎం చాంబర్ లోనే చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, పాలనాపరమైన సీరియస్ అంశాలపై చర్చతో  పాటు కాస్త సరదాగా విషయాలను కూడా వారిద్దరి మాట్లాడుకున్నారు. ఈ భేటీ సమయంలో ఇద్దరు నేతలు సరదాగా నవ్వులు చిందిస్తూ కనిపించారు.  

click me!