Weather Update: తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే?

Published : Sep 08, 2026, 09:04 AM IST

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు, ఈదురుగాలుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది.

PREV
15
అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు వర్షాల అలర్ట్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ స్పష్టం చేసింది.

25
గంటకు 50 కిమీ వేగంతో గాలులు, పిడుగుల ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం ఉత్తర కోస్తాంధ్ర, యానాంతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. వానలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందట. గాలి వేగం ఎక్కువగా ఉండటంతో పాటు పిడుగులు పడే సూచనలు కనిపించడంతో బయటకు వెళ్లే జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

35
తెలంగాణ లోనూ భారీ వర్షాలు

ఇక తెలంగాణ విషయానికొస్తే, రాష్ట్రంలో సెప్టెంబర్ 12 నుంచే ఉరుములతో కూడిన వానలు మొదలవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ 13 నుంచి 17వ తేదీల మధ్య పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందట. సరిగ్గా పండుగ సమయానికి వర్షాల తీవ్రత పెరిగే ఛాన్స్ ఉండటంతో, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది.

45
ఈదురుగాలుల సమయంలో ఇవి పాటించండి

భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ ప్రత్యేక సూచనలు చేసింది. బలమైన గాలుల వల్ల కొమ్మలు విరిగే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద నిలబడకూడదు. విద్యుత్ స్తంభాలు, పాత గోడలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు లేదా హోర్డింగ్లు ఉన్న చోట ఆగకుండా సురక్షితమైన కాంక్రీట్ భవనాల్లో తలదాచుకోవడం మంచిది.

55
ప్రయాణికులు, వాహనదారులు అలర్ట్

వర్షాల సమయం లో రోడ్లు జారే అవకాశం ఉండటంతో ద్విచక్ర వాహనదారులు, కారు డ్రైవర్లు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా నీరు నిలిచే ముప్పు ఉన్నందున ఎప్పటికప్పుడు స్థానిక అధికారుల హెచ్చరికలను గమనిస్తూ ఉండటం మంచిది. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప వర్షం పడేటప్పుడు బయటకు రాకపోవడమే మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories