Visakhapatnam
విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. టిడిపి శ్రేణులతో పాటు చంద్రబాబును అభిమానించేవారు కూడా వివిధ పద్దతుల్లో తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఇలా ఓ యువకుడు చంద్రబాబు అరెస్ట్ పై ఏకంగా విమానంలోనే 'సేవ్ డెమోక్రసి' ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగాడు.
Visakhapatnam
చంద్రబాబును ఎంతగానో అభిమానించే టిడిపి కార్యకర్త ఆడారి కిషోర్ కుమార్ విశాఖపట్నం విమానాశ్రయంలో అలజడి సృష్టించాడు. విమానాశ్రయంలో చంద్రబాబు ఫోటోలతో కూడిన ప్లకార్డులు, విమానం ఎక్కాక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్లకార్డులు ప్రదర్శించాడు. అంతటితో ఆగకుండా రన్ వే పై పడుకుని ఆందోళన చేపట్టాడు.
Visakhapatnam
టిడిపి కార్యకర్త ఆందోళనతో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వినూత్న నిరసనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గవర్నర్ వెంటనే చంద్రబాబు అరెస్ట్ పై కలుగజేసుకుని కోరుతూ 'సేవ్ డొమోక్రసీ' ప్లకార్డులతో ఆందోళన చేపట్టినట్లు కిషోర్ తెలిపాడు.
Visakhapatnam
ఇదిలావుంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ కొందరు యువత చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. చంద్రబాబు హయాంలో నిర్మించిన హైటెక్ సిటీ 'సైబర్ టవర్స్' వద్ద ప్లకార్డులు ప్రదర్శించారు.
Visakhapatnam
'మా భవిష్యత్ కు మీరు పునాదులు వేసారు... మిమ్మల్సి బయటకు తీసుకురావడం మా బాధ్యత' అంటూ చంద్రబాబు ఫోటోలతో కూడిన ప్లకార్డులు యువత ప్రదర్శించారు. ఇలా సైబర్ టవర్స్ ముందు కొందరు యువత నిరసనకు దిగిన ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది.