chandrababu
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్, పార్టీ భవిష్యత్ కార్యచరణపై రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల్లో టీడీపీ సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్బంగా నేతలు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు.
chandrababu
చంద్రబాబు నాయుడు తిరిగి ప్రజా క్షేత్రంలోకి వచ్చేవరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చించారు. స్థానిక నాయకుల అభిప్రాయలు తీసుకుని వాటిపై తీర్మానాలు రూపొందించారు.
chandrababu
రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహారదీక్షలు చేయాలని, రోజుకి ఒక మండలం చొప్పున అన్ని మండలాల నాయకులతో ఒక చోట సామూహిక నిరాహారదీక్షలు చేయాలని నిర్ణయించారు.
chandrababu
చంద్రబాబు నాయుడుకి మద్దతుగా "బాబుతో నేను" అనే లోగోను నేతలు ఆవిష్కరించారు. సమావేశం అనంతరం నేతలు, కార్యకర్తలు బయటకు వచ్చి నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించి మీడియాలో జగన్ సైకో చర్యల్ని ఎండగట్టారు.
chandrababu
మరోవైపు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సమావేశం నిర్వహించినందుకు టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వడం వివాదాస్పదమైంది. అటు విశాఖలో నిరసన తెలుపుండగా పోలీసులు అడ్డుకుని నాయకులు,కార్యకర్తల్ని స్టేషన్‌కి తరలించారు.
chandrababu
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ సమావేశాల్లో పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిమ్మకాయల చినరాజప్ప, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమామహేశ్వరరావు, ఎన్ ఎండీ ఫరూక్, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇంచార్జులు పాల్గొన్నారు.