ఆయన కట్టిన జైల్లోనే చంద్రబాబును కట్టిపడేశారు .. రాజమండ్రిలో భువనేశ్వరి (ఫోటోలు)
Siva Kodati |
Published : Sep 12, 2023, 06:04 PM IST
ఏపీ స్కిల్ డెవలప్‌మంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి కలిశారు. అనంతరం భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జైలులో ఆయనను కలిసి వస్తుంటే.. తన ఒక భాగమేదో అక్కడ వదిలేసి వచ్చినట్టుగా ఉందని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా వాళ్లు మాట్లాడమని అంటున్నారని.. ఏం మాట్లాడాలని అన్నారు.
24
bhuvaneshwari
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనైనా, విభజన తర్వాత ఏపీలోనైనా పొద్దున నుంచి రాత్రి వరకు ప్రజల గురించే చంద్రబాబు ఆలోచించేవారని చెప్పారు. ప్రజల అభివృద్ది కోసం ఆయన జీవితం మొత్తం కృషి చేశారని అన్నారు.
34
bhuvaneshwari
ఎప్పుడైనా తాను కుటుంబం గురించి మాట్లాడితే, గట్టిగా నిలదీస్తే.. ముందు ప్రజలే ముఖ్యమని ఆయన చెప్పేవారని భువనేశ్వరి తెలిపారు. ప్రజలంతా బయటకు వచ్చి వారి హక్కుల కోసం పోరాడాలని కోరారు.
44
bhuvaneshwari
తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ నిర్మించారని.. ఈ పార్టీ ఎక్కడకు వెళ్లదని అన్నారు. తమ కుటుంబం ఎప్పుడూ క్యాడర్ కోసం, ప్రజల కోసం పోరాడి నిలుస్తుందని నారా భువనేశ్వరి చెప్పారు.