నేతల అరెస్టుతో టీడీపీ బేజారు: తాజా టార్గెట్ దేవినేని ఉమ?

First Published | Aug 27, 2020, 5:04 PM IST

ప్రస్తుతం వరుస అరెస్ట్ లతో టీడీపీ బేజారెత్తిపోయిందనేది వాస్తవం. అచ్చెన్నాయుడు అరెస్ట్, ఆ తరువాత జేసీ, హత్య కేసులో కొల్లు రవీంద్ర అరెస్ట్ అయ్యారు. వైసీపీ నేతలు నెక్స్ట్ ఎవరు అంటూ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి గాలి నలువైపులా వీస్తుంది. అఖండ మెజారిటీతో గెలిచింది మొదలు సంక్షేమ పథకాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటేనే... మరోపక్క టీడీపీ కూసాలను కూడా కుదిపేస్తున్నాడు. ఈ దెబ్బకుటీడీపీ నుండి వైసీపీలోకి వలసల పరంపర కొనసాగుతుంది.
ఆపరేషన్ ఆకర్ష్ కి ఆకర్షితులైకొందరు పార్టీ మారుతుంటే.... మరికొందరు తమ ఆర్ధిక మూలలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక అప్పటికి లొంగని కొందరి నేతలపై కేసులతో విరుచుకుపడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అచ్చెన్నాయుడు, జేసీ, కోళ్లు రవీంద్రవి అక్రమ అరెస్టులు అని వారు ఆరోపిస్తున్నారు.

అరెస్టులు అక్రమమా, లేదా నిజంగా వారు అవినీతికి పాల్పడ్డారా అని తేల్చాల్సింది కోర్టులు. వారి పైన ఉన్న కేసుల ఆధారంగా దర్యాప్తు సంస్థలు వారిని అరెస్ట్ చేసాయి. వారిపైనున్న పాత కేసులను తిరగతోడుతున్నారని బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉన్నవారు ఏ విధంగా కేసులతోఇబ్బందిపెడతారనేది జగన్ మోహన్ రెడ్డి విషయంలో మనకు కనబడుతుంది కూడా. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బకు ఆయన సంవత్సరానికి పైగా జైలు జీవితం గడిపారు.
ఇక ఈ విషయాలను పక్కనుంచితే... ప్రస్తుతం వరుస అరెస్ట్ లతో టీడీపీ బేజారెత్తిపోయిందనేది వాస్తవం. అచ్చెన్నాయుడు అరెస్ట్, ఆ తరువాత జేసీ, హత్య కేసులో కొల్లు రవీంద్ర అరెస్ట్ అయ్యారు. వైసీపీ నేతలు నెక్స్ట్ఎవరు అంటూ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇక వైసీపీ మంత్రులు ఆరోపణలు చేయగానే తదుపరి వైసీపీ టార్గెట్ వీరే అంటూ వార్తాకథనాలు కూడా ప్రసారమవుతున్నాయి. ఇక ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే... మరో మాజీ మంత్రికి కూడా కష్టాలు మొదలైనట్టుగా కనబడుతుంది.
పుష్కరాల పనుల అవినీతిపై విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. చంద్రబాబు హయాంలో పుష్యకారాల్లో అవినీతి జరిగిందని, దానిపై విచారణ చేపట్టారు. అందులో అవినీతి కొంతమేరైనా జరిగిందనేది కొందరు అంటున్నమాట.
అవినీతి జరిగిందా లేదా అనేది దర్యాప్తులో తేలుతుంది. ఒకవేళ అవినీతి జరిగితే అది అధికారులు చేసారా, లేదా రాజకీయ నాయకులూ చేసారా అనేది తేలాల్సి ఉంది. ఆ పనులను దగ్గరుండి మరి చూపించింది దేవినేని ఉమ. దీనితో ఇప్పుడు దేవినేని ఉమ నెక్స్ట్ టార్గెట్ అని అంటున్నారు.
ఇప్పుడు ఈ పుష్కరాల్లో జరిగిన అవినీతి కేసు వేగంగా కదులుతోంది. దర్యాప్తు వేగవంతమవడంతో... అప్పుడు ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షించం మాజీ మంత్రి దేవినేని ఉమ ను ఇప్పుడు వైసీపీ సైలెంట్ చేయాలనిచూస్తుందని టాక్ నడుస్తుంది.
ఇప్పటికే వరుస ఎదురు దెబ్బలను ఎదుర్కుంటున్న టీడీపీ... ఈ అరెస్టుల వ్యవహారం వల్ల మరింతగా ఇబ్బంది పడిపోతుంది. నాయకుల పరిస్థితే ఇలా ఉంటే...క్యాడర్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇప్పటికే చాలా మంది వైసీపీ కండువాలు కప్పుకున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితులు టీడీపీకి మరింత కష్టంగా మారేటట్టుగా కనబడుతున్నాయి.

Latest Videos

click me!