ఒక్క దెబ్బకు రెండు పిట్టలు: ఏపీలో నారా లోకేష్ ప్లాన్ ఇదీ...

First Published Aug 27, 2020, 12:11 PM IST

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా లోకేష్ రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. లోకేష్ ఇప్పుడు టీడీపీ నాయకుడిగా ప్రొజెక్ట్ అవడానికి, క్యాడర్ లో జోష్ నింపడానికి లోకేష్ పూనుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయమై సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా విపరీతమైన చర్చ జరుగుతుంది. 

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి టీడీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. క్యాడర్ లో నైరాశ్యం అలుముకుంది. చంద్రబాబు, లోకేష్ లు ఇద్దరు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కరోనా కష్టకాలంతోపాటుగా, దూకుడు మీదున్న వైసీపీ జూలు విదిలిస్తున్న వేళ.... టీడీపీ క్యాడర్ బాగా నీరసించిపోయారు.
undefined
ఒక పక్క వైసీపీ చుక్కలు చూపెడుతుంటే... మరోపక్క బీజేపీ విరుచుకుపడుతుంది. టీడీపీలో ఉంటేరక్షణ దొరకదేమో అని నేతలు, క్యాడర్ భయపడుతున్న వేళ, వారిలో ధైర్యంనింపాల్సిన అవసరం ఉంది. క్యాడర్ లో నూతన్తోసోహం నింపాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
undefined
ఇక ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యం ప్రజల్లో ఉండడం. ప్రజాసమస్యలపై పోరాడడం. అమరావతి విషయంలో చంద్రబాబు బలంగానే పోరాడాడు. పోరాడినప్పటికీ.... భావి నాయకత్వం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
undefined
ఇక ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా లోకేష్ రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. లోకేష్ ఇప్పుడు టీడీపీ నాయకుడిగా ప్రొజెక్ట్ అవడానికి, క్యాడర్ లో జోష్ నింపడానికి లోకేష్ పూనుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయమై సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా విపరీతమైన చర్చ జరుగుతుంది.
undefined
లోకేష్ ఇప్పుడు ఈ రెండు సమస్యలకు ఒకే పరిష్కారం అన్నట్టుగా యాత్రను ప్రారంభించనున్నట్టుగా తెలియవస్తుంది. దాదాపుగా 4000 కిలోమీటర్ల మేర రాష్ట్రమంతా తిరుగుతూ... ప్రజల సమస్యలపై పోరాటం చేయాలనిఅనుకుంటున్నారు.
undefined
ఇక లోకేష్ ఈ మధ్యకాలంలో బరువు తగ్గడం దీనికి మరింత ఊతమిస్తుంది. లోకేష్ బరువు తగ్గిందే పాదయాత్ర కోసమని అంటున్నారు. సోషల్ మీడియా అంతే ఇదే చర్చనడుస్తుంది. ఆయన లాక్ డౌన్ కాలంలో హైదరాబాద్ లోనే ఉంటూ బరువు తగ్గారు. మహానాడు టైం లో ఆయన బరువు తగ్గడమే హైలైట్ గా మారింది. ఆ తరువాత మొన్న స్వతంత్ర దినోత్సవం రోజున కూడా ఆయన జెండావిష్కరణ చేస్తూ దిగిన పిక్ లో కూడా మరింత సన్నబడ్డాడు.
undefined
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొన్ని రోజుల కింద ఒక కామెంటే చేసారు. "పార్టీ వ్యవహారాలను కొడుకుకు అప్పగించాలని బాబు గారు అనుకుంటున్నారా? వయసు పెరగడం, జ్ఞాపకశక్తి క్షీణించడంతో కుమారుడికి పగ్గాలు ఇస్తారంట. కరోనా ఉధృతి తగ్గగానే లోకేశ్ నాయుడును ‘కాబోయే సీఎం'గా ఎలివేట్ చేసేలా సైకిల్ యాత్ర చేయించాలని ఎల్లో మీడియా ముఖ్యులు రూట్ మ్యాప్ ఇచ్చారంట." అని అన్నారు.
undefined
ఈ వ్యాఖ్య చేయడంతో చర్చ మరింత ఉధృతమైంది. పాదయాత్రనో, లేదా పార్టీ గుర్తు కూడా కలిసి వచ్చేలా సైకిల్ యాత్రనా ఏదో ఒకటయితే లోకేష్ ప్లాన్ చేస్తున్నట్టుగా మాత్రంఅర్థమవుతుంది. సైకిల్ మీద రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సాధ్యమైనంత మేర పర్యటించాలని లోకేష్ ప్రణాళిక రచిస్తున్నారని అంటున్నారు.
undefined
ఇక ముహూర్తం విషయానికి వస్తే... ప్రస్తుతం కరోనా ఉధృతంగా ఉన్నందున ఇప్పుడప్పుడయితే ఇది సాధ్యమయ్యేలా కనబడడం లేదు. జనవరి నాటికి వాక్సిన్ వస్తుందన్న ఆశాభావాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నందున... ఆ తరువాత ఈ ప్లానింగ్ ఉండబోతున్నట్టుగా చెబుతున్నారు.
undefined
జగన్ రెండు సంవత్సరాల పాలన పూర్తయిన తరువాత దీనికి శ్రీకారం చుడితే... ఎన్నికల ముందు వరకు ప్రజల్లోనే ఉండొచ్చని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి, ఆయన తండ్రి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణం కూడా ఈ పాదయాత్రే!
undefined
ఇప్పుడు ఇదే బాటలో పయనిస్తున్న లోకేష్ జగన్ రికార్డును బ్రేక్ చేస్తూ... జగన్ కన్నా అధికంగా, 4000 కిలోమీటర్లు తిరిగి.....అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడంతోపాటుగా, టీడీపీ భావి నాయకుడు తానేననిఅనిపించుకునే దిశగా పావులు కదుపుతున్నారు.
undefined
click me!