రాజమండ్రి రూరల్ అసెంబ్లీలో జనసేనే పోటీ: ట్విస్టిచ్చిన గోరంట్ల

First Published | Feb 21, 2024, 1:44 PM IST

రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్  నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తుందని  ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ స్థానం నుండి  తానే బరిలోకి దిగుతానని  టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించడం చర్చకు దారి తీసింది.

రాజమండ్రి రూరల్ అసెంబ్లీలో జనసేనే పోటీ: ట్విస్టిచ్చిన గోరంట్ల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పొత్తులు తెలుగు దేశం నేతలపై  ప్రభావం చూపుతున్నాయి.  త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి  ఎన్నికలు జరగనున్నాయి.  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో  తెలుగు దేశం, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి

రాజమండ్రి రూరల్ అసెంబ్లీలో జనసేనే పోటీ: ట్విస్టిచ్చిన గోరంట్ల

అయితే ఈ కూటమిలో బీజేపీ కూడ  చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతుంది. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డాలతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు.దీంతో  బీజేపీ కూడ ఈ కూటమిలో చేరే అవకాశం ఉందనే ఊహగానాలు ప్రారంభమయ్యాయి

Latest Videos

రాజమండ్రి రూరల్ అసెంబ్లీలో జనసేనే పోటీ: ట్విస్టిచ్చిన గోరంట్ల

 ఈ నెల  22వ తేదీన  పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. పొత్తుల విషయమై  పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత  బీజేపీ ఈ కూటమిలో చేరే విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.

రాజమండ్రి రూరల్ అసెంబ్లీలో జనసేనే పోటీ: ట్విస్టిచ్చిన గోరంట్ల

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన  జనసేన నేతలతో  పవన్ కళ్యాణ్ మంగళవారంనాడు రాజమండ్రిలో సమావేశమయ్యారు.  రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానంలో  జనసేన పోటీ చేస్తుందని  పార్టీ నేతలకు  పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారని జనసేన వర్గాల్లో ప్రచారం సాగుతుంది.  రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం నుండి  మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ను జనసేన బరిలోకి దింపనుందనే ప్రచారం  కూడ సాగుతుంది

రాజమండ్రి రూరల్ అసెంబ్లీలో జనసేనే పోటీ: ట్విస్టిచ్చిన గోరంట్ల

అయితే  రాజమండ్రి రూరల్ నుండి  తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం నుండి బుచ్చయ్య చౌదరి రెండు దఫాలు విజయం సాధించారు. గతంలో రాజమండ్రి నుండి  నాలుగు దఫాలు ఆయన విజయం సాధించారు. 

రాజమండ్రి రూరల్ అసెంబ్లీలో జనసేనే పోటీ: ట్విస్టిచ్చిన గోరంట్ల

అయితే ఈ విషయమై  ఇవాళ సోషల్ మీడియా వేదికగా  తెలుగు దేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు.  సోషల్ మీడియాలో, ప్రసార సాధనాల్లో సాగుతున్న ప్రచారాన్ని చూసి  అధైర్య పడవద్దని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. తానే పోటీ చేస్తానని  ఆయన ప్రకటించారు.

click me!