మరోసారి భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ: క్లారిటీ ఇచ్చిన జనసేనాని

First Published | Feb 21, 2024, 12:59 PM IST

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు.ఈ విషయమై  పవన్ కళ్యాణ్  తెలుగు దేశం పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారని ప్రచారం సాగుతుంది.
 
మరోసారి భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ: క్లారిటీ ఇచ్చిన జనసేనాని

త్వరలో జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం అసెంబ్లీ స్థానం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు.ఈ విషయమై  తెలుగు దేశం పార్టీ నేతలకు  పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారని సమాచారం.

మరోసారి భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ: క్లారిటీ ఇచ్చిన జనసేనాని

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్  బుధవారం నాడు పర్యటించారు.  రాజమండ్రి నుండి ఏలూరుకు ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చారు. తెలుగు దేశం పార్టీ నేత, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు.  

Latest Videos

మరోసారి భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ: క్లారిటీ ఇచ్చిన జనసేనాని

తెలుగు దేశం నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి  వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలుగు దేశం నేతలకు స్పష్టత ఇచ్చినట్టుగా  సమాచారం.  రెండు పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారని సమాచారం.

మరోసారి భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ: క్లారిటీ ఇచ్చిన జనసేనాని

2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు.ఈ రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు.  గత ఎన్నికల్లో రాజోలు నుండి  పోటీ చేసిన  రాపాక వరప్రసాద్ మాత్రమే  విజయం సాధించారు.

మరోసారి భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ: క్లారిటీ ఇచ్చిన జనసేనాని

రాపాక వరప్రసాద్ కూడ  వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో  జనసేన పార్టీ సీపీఐ, సీపీఐ(ఎం), బీఎస్‌పీతో కలిసి పోటీ చేసింది.  అయితే  ఈ దఫా మాత్రం తెలుగు దేశం పార్టీతో కలిసి పోటీచేయనున్నట్టుగా జనసేన ప్రకటించింది. అయితే  తెలుగు దేశం, జనసేన కూటమిలో  బీజేపీ కూడ చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.

మరోసారి భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ: క్లారిటీ ఇచ్చిన జనసేనాని

బీజేపీ నేతలను కలిసేందుకు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ  మధ్యాహ్నం  న్యూఢిల్లీకి వెళ్లనున్నారు.  వీలైతే ఇవాళ రాత్రికి లేదా రేపు బీజేపీ అగ్రనేతలను పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉందని సమాచారం. చంద్రబాబు కూడ  న్యూఢిల్లీకి వెళ్తారా లేదా అనే విషయమై  ఇంకా స్పష్టత రాలేదు.

click me!