మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సొంతగూటికి వచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. మంగళగిరిలో మళ్లీ నారా లోకేశ్ ఓడిపోవడం ఖాయం అని స్పష్టం చేశారు.
YSR Congress Party: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి వచ్చారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు ఆయన అయోధ్య రామిరెడ్డి, గంజి చిరంజీవిలతో కలిసి సీఎం కార్యాలయానికి వెళ్లారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
24
alla rama krishna reddy
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ మొదటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని వివరించారు. ఇప్పటికీ ఆయన ఆ మార్గాన్ని వదల్లేదని తెలిపారు. జగన్‌తోనే రాష్ట్రం బాగుపడుతుందని పేర్కొన్నారు. అందుకే తాను తిరిగి వైసీపీలోకి వచ్చినట్టు వివరించారు.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి ముందే ఆర్కే కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. షర్మిలతోపాటు తాను కూడా ఏపీ కాంగ్రెస్‌లో చేరుతానని వెల్లడించారు. ఆ తర్వాత ఆయన ఏపీ కాంగ్రెస్‌లోకి వెళ్లారు కూడా. కానీ, ఇప్పుడు వైఎస్ షర్మిలకు, ఏపీ కాంగ్రెస్‌కు షాక్ ఇస్తూ బయటికి వచ్చారు. మళ్లీ వైసీపీలోకి చేరడంతో పార్టీ వర్గాల్లో హుషారు వచ్చింది. ఆర్కే మళ్లీ వైసీపీలోకి రావాలని క్యాడర్, స్థానిక నాయకులు ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం.
34
alla ramakrishna reddy
తాను వైఎస్ఆర్ భక్తుడినని ఆర్కే స్పష్టం చేశారు. తాను షర్మిలమ్మ వద్దకే వెళ్లానని వివరించారు. కానీ, కాంగ్రెస్ పెద్దల్లోగానీ, ప్రతిపక్షాల్లో గానీ జగన్‌ను ఓడించాలనే ధ్యాస తప్ప రాష్ట్ర ప్రజల గురించి చర్చ లేదని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిలో జగన్ ప్రభుత్వంలో ఉండాలనే ఉద్దేశంతోనే తాను తిరిగి వైసీపీలోకి వచ్చినట్టు వివరించారు.
44
Alla Ramakrishna Reddy (Mangalagiri)
మూడోసారి వైసీపీ గెలిచి తీరుతుందని, మంగళగిరిలో లోకేశ్ ఓడిపోవడం ఖాయం అని ఆర్కే కామెంట్ చేశారు. మంగళగిరిలో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా తాను వారి గెలుపు కోసం కృషి చేస్తానని వివరించారు. ఇక్కడ ఒక బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేశ్ ఓడిపోవడం ఖాయం అని అన్నారు.