Published : May 13, 2025, 07:07 AM ISTUpdated : May 13, 2025, 07:13 AM IST
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యార్థులకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు కూడా సమ్మర్ హాలిడేస్ మొదలయ్యాయి. వీరికి ఎప్పట్నుంచి ఎప్పటివరకు సెలవులున్నాయో తెలుసా?
Summer Holidays : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయమే సుర్రుమంటున్న ఎండలు మధ్యాహ్నానికి మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఈ మండుటెండల నుండి పిల్లలకు రక్షణగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుకు కూడా వేసవి సెలవులు ప్రకటించారు.
25
AP High Court Summer Holidays
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుకు మే 12 నుండి జూన్ 13 వరకు వేసవి సెలవులు ఇచ్చారు. ఈ మేరకు కోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీచేసారు. ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ బెంచ్ లు ఏర్పాటుచేసారు. అంటే వేసవి సెలవుల మధ్యలో కూడా న్యాయమూర్తులు కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది.
35
AP High Court Summer Holidays
మే 15,22 తేదీల్లో జస్టిస్ కె. సురేష్ రెడ్డి, జస్టిస్ వై. లక్ష్మణరావు డివిజన్ బెంచ్ లతో పాటు జప్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్ విచారణ చేపట్టనుంది. ఇక మే 29న జస్టిస్ ఎన్. హరినాథ్, జస్టిస్ వై. లక్ష్మణరావు డివిజన్ బెంచ్ తో పాటు జస్టిస చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్ విచారణ జరుపుతుంది. జూన్ 5, 12 తేదీల్లో జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ టిసిడి. శేఖర్ డివిజన్ బెంచ్... జస్టిస్ కుంచం మహేశ్వరరావు సింగిల్ బెంచ్ విచారణ చేపట్టనున్నారు.
ఇదిలావుంటే ఇప్పటికే తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. మే 5 నుండి జూన్ 6 వరకు ఈ సెలవులు కొనసాగుతాయి. అయితే మే 7,14,21,28 తో పాటు జూన్ 4 తేదీల్లో అత్యవసర కేసుల విచారణ చేపట్టనున్నట్లు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేసారు.
55
telangana high court summer holidays
మే 7న జస్టిస్ సూరేపల్లి నందా, జస్టిస్ జె. శ్రీనివాసరావు డివిజన్ బెంచ్, జస్టిస్ పుల్ల కార్తీక సింగిల్ బెంచ్ విచారణ చేపట్టారు. మే 14న జస్టిస్ పుల్ల కార్తీక, జస్టిస్ నందికొండ నర్సింగరావు డివిజన్ బెంచ్, జస్టిస్ జె. శ్రీనివాసరావు సింగిల్ బెంచ్ విచారణ చేపట్టనుంది. మే 21న జస్టిస్ నగేష్ భీమపాక, జస్టిస్ నందికొండ నర్సింగరావు, జస్టిస్ జె. శ్రీనివాసరావు సింగిల్ బెంచ్... మే 28న జస్టిస్ నగేష్ భీమపాక, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి డివిజన్ బెంచ్, జస్టిస్ కె. శరత్ సింగిల్ బెంచ్... జూన్ 4న జస్టిస్ కె. శరత్, జస్టిస్ బిఆర్ మధూసూదన్ రావు డివిజన్ బెంచ్, జస్టిస్ కె. సుజన సింగిల్ బెంచ్ విచారణ చేపట్టనుంది.