Salaries Hikes : ఏపీలో వీరికి జీతాలు పెంపు.. ఇదిగో జీవో

Published : May 12, 2025, 07:39 PM IST

Salaries Hikes: ఆంధ్రప్రదేశ్ లో గెస్ట్ లెక్చరర్ల జీతాన్ని గంటకు రూ.375కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, వీరు నెలకు గరిష్టంగా రూ.27,000 అందుకోనున్నారు.   

PREV
15
Salaries Hikes : ఏపీలో వీరికి జీతాలు పెంపు.. ఇదిగో జీవో

AP government hikes salaries: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో గెస్ట్ లెక్చరర్ల జీతాలు పెంచూతు నిర్ణయం తీసుకున్నారు. 

25

రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో గెస్ట్ లెక్చరర్ల జీతాలను పెంచుతూ సోమవారం ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. సంబంధిత ఉత్తర్వుల ప్రకారం.. గెస్ట్ లెక్చరర్లకు ఇప్పటి వరకు చెల్లిస్తున్న గంటకు రూ.150 పారితోషికాన్ని రూ.375కి పెంచారు. దీనివల్ల ఒక నెలకు గరిష్టంగా రూ.27,000 వేతనం అందనుంది.

35

గెస్ట్ లెక్చరర్ల జీతాల పెంపు జీవో విడుదల తర్వాత ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ పెంపు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 1177 మంది గెస్ట్ లెక్చరర్లు లబ్ధిపొందనున్నారు. 

 

45

ఇప్పటి వరకూ గెస్ట్ లెక్చరర్లకు నెలకు గరిష్టంగా రూ.10,000 మాత్రమే చెల్లించేవారు. దీంతో తాజాగా తీసుకున్న నిర్ణయంతో గెస్ట్ లెక్చరర్లకు లాభం కలగనుంది. గత కొన్ని సంవత్సరాలుగా గెస్ట్ లెక్చరర్లు తమ వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. 

ఆంధ్రప్రదేశ్ గెస్ట్ లెక్చరర్ల జీతాల పెంపు జీవో ఇక్కడ చూడండి

55

కాగా, ఏపీలో గెస్ట్ లెక్చరర్లుగా పనిచేయడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. అలాగే ఏపీసెట్, యూజీసీ నెట్, లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణులు అయిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలు, డెమో లెక్చర్ ఆధారంగా జరుగుతుంది. సంబంధిత కాలేజీలు ప్రిన్సిపాల్‌లు లేదా అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా  గెస్ట్ లెక్చరర్లకు భర్తీకి నోటిఫికేషన్ ఇస్తుంటారు. 

Read more Photos on
click me!

Recommended Stories