School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి సెలవులే సెలవులు... దసరా తర్వాత కూడా పదిరోజుల హాలిడేస్

Published : Oct 21, 2026, 11:43 AM IST

దసరా హాలిడేస్ తర్వాత కూడా తెలుగు విద్యార్థులకు వరుస సెలవులు రాబోతున్నాయి. ఇలా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ స్కూళ్లకి ఏఏ రోజుల్లో, ఎందుకు సెలవులు వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
దసరా తర్వాత కూడా సెలవులే సెలవులు

దసరా వేడుకలు ముగిశాయి... దీంతో ఇక విద్యాసంస్థలకు సెలవులు కూడా ముగియనున్నాయి. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే సమయం ఆసన్నమైంది... ఇక విద్యార్థులు బడిబాట పట్టాల్సి ఉంటుంది. దాదాపు 12-13 రోజుల దసరా హాలిడేస్ ని ఎంజాయ్ చేసిన విద్యార్థులను ఒక్కసారిగా స్కూల్ కి వెళ్లమంటే బాధగానే ఉంటుంది. ఇలాంటి పిల్లలకు ఊరటనిచ్చేలా తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

వీకెండ్ తో తెలంగాణలో, స్థానిక సంస్థల ఎన్నికలతో ఆంధ్ర ప్రదేశ్ లో పలు విద్యాసంస్థలకు ప్రత్యేక సెలవులు రాబోతున్నాయి. ఏపీలో మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరగనున్నాయి... పోలింగ్ కేంద్రాలుగా ఎంపికైన పాఠశాలలకు ఆయా తేదీల్లో సెలవులు వర్తించనున్నాయి. మరోవైపు తెలంగాణలో దసరా సెలవులు అక్టోబర్ 22తో ముగియనుండగా, కొన్ని పాఠశాలల విద్యార్థులకు వారాంతపు సెలవులు కలిసిరానున్నాయి. ఇలా ఏపీలో ఎన్నికల కారణంగా ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయి? తెలంగాణ విద్యార్థులకు ఎన్ని రోజులు విరామం లభించనుంది? వివరంగా తెలుసుకుందాం.

25
ఏపీలో అక్టోబర్ 27, 28 తేదీల్లో సెలవులు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది… అక్టోబర్ 28న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల కోసం పలు పాఠశాలలు, విద్యాసంస్థలను పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగించనున్నారు. దీంతో ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ నిర్వహణకు వీలుగా ఆయా విద్యాసంస్థలకు అక్టోబర్ 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు సెలవులు ఇస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి సెలవుల ప్రకటన కూడా వచ్చింది.

అయితే ఈ సెలవులు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వర్తిస్తాయని భావించకూడదు. పోలింగ్ కేంద్రాలుగా ఎంపికైన విద్యాసంస్థలకు మాత్రమే సంబంధిత ఆదేశాల ప్రకారం సెలవులు వర్తిస్తాయి. మరోవైపు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ రోజైన అక్టోబర్ 28న సెలవు కల్పించనున్నారు.

35
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మూడ్రోజుల సెలవులా!

గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కూడా కొనసాగనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 20 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 24న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 27న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. ఈ ఎన్నికలకు నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనుండగా, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

అయితే ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ కేంద్రాలుగా ఎంపికైన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో నవంబర్ 2న సెలవు ఇవ్వనున్నారు. ముందురోజు ఎన్నికల సామగ్రిని తరలించడం, ఇతర ఏర్పాట్లు చేయడం ఇందుకు కారణం.

నవంబర్ 3న పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనల ప్రకారం సెలవులు వర్తిస్తాయి. నవంబర్ 1 ఆదివారం కావడంతో కొందరికి వరుసగా మూడు రోజుల విరామం లభించే అవకాశం ఉంది.

45
గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ మరోసారి సెలవులు

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం మొదటి విడత పోలింగ్ నవంబర్ 26న, రెండో విడత నవంబర్ 29న, మూడో విడత డిసెంబర్ 2న జరగనుంది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం కూడా పాఠశాలలను పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగించే అవకాశం ఉంది. దీంతో ఎన్నికలు జరిగే గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలుగా ఎంపికైన విద్యాసంస్థలకు సెలవులు వచ్చే అవకాశం ఉంటుంది. పోలింగ్‌కు ముందు ఏర్పాట్లు, పోలింగ్ రోజు నిర్వహణను బట్టి సంబంధిత తేదీల్లో సెలవులు ప్రకటించవచ్చు.

మూడు విడతల ఎన్నికలు వేర్వేరు తేదీల్లో జరగనున్నందున, ఆయా ప్రాంతాల్లోని విద్యార్థులకు వేర్వేరు సమయాల్లో సెలవులు రావచ్చు. ఈ విధంగా మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా నవంబర్ వరకు పలు విద్యాసంస్థలకు విడతలవారీగా సెలవులు వచ్చే అవకాశం ఉంది. అయితే అన్ని పాఠశాలలకు సెలవులు ఉంటాయని భావించకుండా, సంబంధిత పాఠశాలలకు జారీ చేసే అధికారిక ఉత్తర్వులను పరిశీలించాలి.

55
తెలంగాణలో దసరా తర్వాత మూడ్రోజులు సెలవులు

తెలంగాణలో పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబర్ 22 వరకు కొనసాగనున్నాయి. అక్టోబర్ 23, శుక్రవారం నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కొన్ని పాఠశాలలకు శనివారం, ఆదివారం సాధారణ సెలవులు ఉంటాయి. ఇలాంటి స్కూల్స్ విద్యార్థులు శుక్రవారం ఒక్కరోజు కవర్ చేస్తే మరో మూడ్రోజుల సెలవులు కలిసివస్తాయి. అక్టోబర్ 23,24,25 మూడ్రోజులు దసరా హాలిడేస్ లో కలిసిపోతాయి... అక్టోబర్ 26 (సోమవారం) నుండి స్కూళ్లకు వెళ్లవచ్చు.

అయితే ఈ మూడ్రోజుల (అక్టోబర్ 23,24,25) సెలవులు అందరికీ వర్తించవు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 23న పున:ప్రారంభం కానున్నాయి... రెండ్రోజులు కొనసాగాక (శుక్ర, శనివారం) ఆదివారం సెలవు వస్తుంది. కానీ ఎక్కువమంది విద్యార్థులు అక్టోబర్ 26 (సోమవారం) నుండే స్కూల్ బాట పట్టే అవకాశాలున్నాయి.

సెలవులపై విద్యార్థులు ఏం గుర్తుంచుకోవాలి?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా పోలింగ్ కేంద్రాలుగా ఎంపికైన విద్యాసంస్థలకు మాత్రమే సంబంధిత తేదీల్లో ప్రత్యేక సెలవులు వర్తిస్తాయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 28న, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 3న జరగనున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో మూడు విడతలుగా నిర్వహించనున్నారు.

తెలంగాణలో మాత్రం దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 23 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. వారాంతపు సెలవులు కలిసివచ్చే విద్యార్థులకు అక్టోబర్ 23 నుంచి 25 వరకు మూడు రోజుల విరామం లభించవచ్చు. సెలవుల విషయంలో గందరగోళం లేకుండా విద్యార్థులు, తల్లిదండ్రులు తమ పాఠశాల యాజమాన్యం నుంచి వచ్చే సమాచారం, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులను పరిశీలించడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories