ఓనర్ తో డ్రైవర్ వివాహేతర సంబంధం.. వేరేవాళ్లతో ఛాటింగ్ చేస్తుందని హత్యాయత్నం.. చివరికి...

Published : Jul 11, 2023, 12:38 PM IST

పదిహేనేళ్లుగా తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. వేరే వారితో సన్నిహితంగా ఉంటుందని కక్ష పెంచుకున్నాడో ప్రియుడు. ఆమె మీద కత్తితో దాడిచేసి హత్యాయత్నం చేశాడు. 

PREV
18
ఓనర్ తో డ్రైవర్ వివాహేతర సంబంధం.. వేరేవాళ్లతో ఛాటింగ్ చేస్తుందని హత్యాయత్నం.. చివరికి...

కృష్ణ జిల్లా : ఏపీలోని కృష్ణాజిల్లా ముస్తాబాద్ శివారులో సోమవారం ఓ మహిళపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. అయితే ఈ దాడికి కారణం వివాహేతర సంబంధమే అని తెలుస్తుంది. తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ మరొకరితో చాటింగ్ చేస్తుందని అనుమానించిన ప్రియుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలలోకి పెడితే…

28

విజయవాడ మారుతి నగర్ లోని ఓ ఇంట్లోని పెంట్ హౌస్ లో బర్రె కిరణ్ అనే వ్యక్తి కిరాయికి ఉంటున్నాడు. అతను టాక్సీ నడుపుతుంటాడు.  15 ఏళ్లుగా ఆ ఇంటి యజమానురాలతో వివాహేతర సంబంధం ఉంది. 

38

ఇటీవల ఆమె ఎవరితోనో తరచుగా ఫోన్లో మాట్లాడుతుండడం,  అర్ధరాత్రి వరకు ఆన్లైన్ చాటింగ్ లో ఉండడం కిరణ్ గమనించాడు.  దీంతో ఆమె మీద అనుమానం పెంచుకున్నాడు. 

48

తనతో కాకుండా ఇంకా వేరే వాళ్ళతో కూడా సంబంధం పెట్టుకుందేమో అని అనుమానించాడు. వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని..  ఆమెను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. పక్కా పథకం ప్రకారం బ్యాంకులో పని ఉందని ఆమెకు చెప్పి నమ్మించాడు.

58

దీనికోసం తన కారులో విజయవాడ నుంచి నున్న మీదుగా ముస్తాబాద్ బయలుదేరాడు. మధ్యలో పెట్రోల్  పోయించుకోవాలంటూ పెట్రోల్ బంక్ లో ఆపి  ఓ క్యాన్ లో నాలుగు లీటర్ల పెట్రోల్ కూడా కొన్నాడు. ఆ తర్వాత ముస్తాబాద్ శివారు ప్రాంతానికి వచ్చాడు.

68

కారులో ఉన్న సమయంలోనే నువ్వు వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకున్నావంటూ మహిళతో కిరణ్ మహిళతో గొడవకు దిగాడు.కారులోనే ఆమె మీద  కత్తితో దాడి చేశాడు. తన పథకంలో భాగంగా కూరగాయలు కోసే చాకును తనతో పాటు తీసుకువచ్చాడు కిరణ్. కత్తితో మెడమీద దాడి గమనించిన ఆమె అప్రమత్తమై చేతిని అడ్డుపెట్టుకుని పెనుగులాడింది. 

78

ఈ పెనుగులాటలో కారు ఆగడంతో వెంటనే కారు దిగి గట్టిగా కేకలు వేసింది. సమీపంలోని బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న టిప్పర్ డ్రైవర్లు ఆమెను గమనించారు. వారు వెంటనే ఆమెను రక్షించారు.  పోలీసులకు సమాచారం అందించారు.

88
Arrested

ఎయిర్పోర్టు డ్యూటీలో ఉన్న ఎస్ఐ నాగరాజు తన సిబ్బందితో సమాచారం అందుకుని పది నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే నిందితుడు కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వచ్చేసరికి మెడపై చాకు ఘాట్లతో గాయపడి ఉన్న ఆమెను.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితురాల నుంచి ఫిర్యాదు తీసుకుని కిరణ్ మీద కేసు నమోదు చేశారు.  ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లుగా సీఐ కనకరావు తెలిపారు. 

click me!

Recommended Stories