ఛీ ఛీ... ఈ వరదల్లోనూ జగనన్న భజనా!: రోజాకు గట్టిగానే ఇచ్చిపడేస్తున్నారుగా

First Published | Sep 6, 2024, 7:48 PM IST

విజయవాడ వరదల వేళ మాజీ మంత్రి రోజా చేసిన పొలిటికల్ కామెంట్స్ దుమారం రేపాయి. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా వుంది రోజా తీరు అంటూ మండిపడుతున్నారు. ఇంతకూ రోజా ఏమన్నారంటే... 

Vijayawada Floods

Roja Selvamani : భారీ వర్షాలు ఆంధ్ర ప్రదేశ్ ను అతలాకుతలం చేసాయి... ముఖ్యంగా విజయవాడను వరదనీరు ముంచెత్తింది. బుడమేరు ఉప్పొంగి నగరంలోని జనావాసాలపై విరుచుకుపడింది... ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వరదనీరు ప్రమాదకర స్థాయికి చేరుకుని ప్రాణనష్టం, ఆస్తినష్టాన్ని సృష్టించింది. ఇలా గత వారం రోజులుగా విజయవాడ పరిస్థితి అత్యంత దయనీయంగా వుంది. 

ఇలా వరదలతో ప్రజలు అవస్థలు పడుతుంటే... ఈ పరిస్థితిని రాజకీయాల కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసిపి నేతలపై తీవ్ర విమర్శలు వస్తున్నారు. ఇటీవల వరద పరిస్థితిని పరీక్షించేందుకు వెళ్ళిన వైసిపి అధినేత వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇంటిని కాపాడుకునేందుకే విజయవాడను ముంచేసారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. కృష్ణా నది ఒడ్డున తాను నివాసముండే ఇళ్లు ఎక్కడ వరదనీటిలో మునుగుతుందోనని భయపడ్డ చంద్రబాబు నీటిని విడుదల చేసారని అన్నారు. ఇలా ఒక్కసారిగా వరదనీటిని వదలడంతో విజయవాడ మునిగిందని జగన్ ఆరోపించారు. 

అయితే విజయవాడ వరదలతో రాజకీయం చేయడమేంటి? ఏమాత్రం లాజిక్ లేకుండా  వరదలకు, చంద్రబాబుకు లింక్ పెట్టడం ఏమిటి? అంటూ జగన్ పై టిడిపి, జనసేన నాయకులే కాదు ప్రజలు కూడా సీరియస్ అవుతున్నారు. ఈ సమయంలో మాజీ మంత్రి రోజా కామెంట్స్ మరింత దుమారం రేపాయి. 
 

Vijayawada Floods

ఇంతకీ రోజా ఏమన్నారంటే..: 

భారీ వర్షాలు, వరదల నుండి విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గత వారం రోజులుగా నీట మునిగివున్న కాలనీలు వరదనీరు తగ్గుముఖం పట్టడంతో భయటపడ్డాయి. దీంతో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ఇళ్ళూవాకిలి వదిలి వెళ్లిపోయిన ప్రజలు మెళ్లిగా ఇళ్లకు చేరుకుంటున్నారు. ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

ఈ సహాయక చర్యలపై మాజీ మంత్రి రోజా పొలిటికల్ కామెంట్స్ చేసారు. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలన్నీ వైఎస్ జగన్ పాలనలో చేపట్టిన చర్యలవల్లే సాధ్యమయ్యాయని అన్నారు.  

''జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు

జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ

జగనన్న నియమించిన వాలంటీర్ వ్యవస్థ

జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్

జగనన్న హయాంలో కొన్న 108, 104వాహనాలు

జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు

జగనన్న తీసుకొచ్చిన క్లీన్ ఆంధ్రా వాహనాలు

జగనన్న తీసుకొచ్చిన వై ఎస్సార్ హెల్త్ సెంట్రర్లు

ఈరోజు వరద కష్టాల నుండి విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయి...'' అంటూ ఎక్స్ వేదికన ట్వీట్ చేసారు వైసిపి నాయకురాలు రోజా. 
 


Vijayawada Floods

రోజా కామెంట్స్ పై దుమారం :  

విజయవాడ నగరం భారీ వరదల నుండి చాలా తొందరగా భయటపడింది... ప్రభుత్వ యంత్రాంగం హుటాహుటిన కదలడంతో ప్రాణాపాయం తప్పింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వయసులోనూ ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వరదనీటిలో పర్యటించారు... బాధితుల పరిస్థితిని తెలుసుకుని వారికి సహాయం అందేలా చూసారు.  

ముఖ్యమంత్రే ఇలా వరదనీటిలో దిగడంతో ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తం అయ్యింది. సీఎం స్వయంగా పర్యవేక్షించడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, నాయకులంతా కదిలారు...ఆపత్కాలంలో బాధితులకు అండగా నిలిచారు. ఇలా తాము ఇంత సురక్షితంగా భయటపడిందంటే అందుకు  కూటమి ప్రభుత్వమే కారణమని ప్రజలు భావిస్తున్నారు.

ఇలాంటి సమయంలో వైఎస్ జగన్ విజయవాడ ప్రజలను కాపాడారంటూ రోజా చేసిన కామెంట్స్  దుమారం రేపాయి. ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే ఈ జగన్ భజన ఏమిటి అంటూ రోజాకు చురకలు అంటిస్తున్నారు నెటిజన్లు. 

Vijayawada Floods

రోజాపై ఆంధ్రుల ఆగ్రహం : 

వరదల భారినపడ్డ విజయవాడను వైఎస్ జగన్ ఏదో సొంత డబ్బుతో ఉద్దరిస్తున్నట్లు రోజా మాట్లాడుతున్నారు... నిజానికి ఈ వరదలకు ఆయనే కారణమని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లలో బుడమేరులో అక్రమ నిర్మాణాలు వెలిసాయి.. దీని ఫలితమే ఈ వరదలని అన్నారు. ఇలా వరదలకు కారణమైన వైఎస్ జగన్ భజనచేయడం ఆపాలంటూ రోజాకు కౌంటర్ ఇచ్చారు.

ఇక మరో నెటిజన్... వరదల్లో జనాలు అలమటిస్తుంటే ఇంట్లో కూర్చొని ఈ జగనన్న అంటూ డబ్బాకొట్టడానికి సిగ్గు లేదా అంటూ మండిపడ్డాడు. అయినా కూటమి ప్రభుత్వం వాడుకుంటున్నవి ప్రభుత్వ వాహనాలే... ప్రజల డబ్బుతో కొన్నవి... మీ జగనన్న కష్టార్జితంతో కొన్నవి కావు అంటూ చురకలు అంటిస్తున్నారు. 

''ప్రజల సొమ్ముతో మీరందరూ పందికొక్కులా తిన్నారు. మీ కడుపు నిండాక ప్రజలు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. విజయవాడ వరదల్లో మునిగిపోతే కనీసం మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించడంలేదు... దొబ్బితిన్న నీలాంటి మంత్రులు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు'' అంటూ మరో నెటిజన్ మండిపడ్డాడు.

చింత చచ్చినా పులుపు చావలేదంటూ కొందరు... డైమండ్ రాణి ఇంకా జగన్ భజన మర్చిపోవడం లేదంటూ మరికొందరు కామెంట్స్ చేసారు. ఓ నెటిజన్ అయితే జగనన్న అధికారంలో వుండివుంటే విజయవాడలో వరదలే రానిచ్చేవారు కాదు...  ఆకాశానికి డైపర్ వేసేవాడు అన్నా అంటారు మాజీ మంత్రి రోజాగారు అంటూ సెటైర్ వేసాడు. 

Vijayawada Floods

విజయవాడ వరదలపై రోజా ఇంకేమన్నారంటే : 

విజయవాడలో పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది... చిన్న పిల్లలు, మహిళలు, వ‌ృద్దులు వరదనీటిలో తీవ్ర అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి రోజా అన్నారు. ఈ వరద నీటిలో చిక్కుకున్న ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు... వారు ఎంత నరకం అనుభవించారో అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. 

విజయవాడ వరదలకు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని రోజా ఆరోపించారు. భారీ వర్షాలు కురుస్తాయని ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించినా పట్టించుకోలేదని అన్నారు. ఆగస్ట్ 29, 30 తేదీల్లో సీఎం చంద్రబాబు నుండి మంత్రుల వరకు అందరూ వీకెండ్ విహార యాత్రలకు ప్లాన్ చేసుకున్నారు...  అందువల్లే భారీ వర్షాల హెచ్చరికలను పట్టించుకోలేదని రోజా ఆరోపించారు.

విజయవాడను వరద ముంచెత్తింది...  ఈ సమయంలో  పంచాయితీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఎక్కడ? అని రోజా ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఎందుకు పర్యటించలేదు? కనీసం సహాయక చర్యలపై అయినా ఎందుకు సమీక్ష చేయడంలేదు? అని రోజా ప్రశ్నించారు.  నారా లోకేష్ కూడా ఎక్కడా కనిపించడంలేదని రోజా ఆరోపించారు. 
 

Latest Videos

click me!