Rain Alert: ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని కొన్ని ప్రదేశాల్లో నాలుగు రోజులు వచ్చే కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మలక్కా జలసంధి పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం శక్తిని సంతరించుకుంటూ పశ్చిమ, వాయువ్య దిశలో నెమ్మదిగా కదులుతోంది. ఈ వ్యవస్థ కొన్ని గంటల్లోనే తుపాను దశకు చేరే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుత గాలి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సముద్రం పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
25
బంగాళాఖాతం–శ్రీలంక దక్షిణం మీదుగా అల్పపీడనం
నైరుతి బంగాళాఖాతం నుంచి దక్షిణ శ్రీలంక దాకా విస్తరించిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వచ్చే 12 గంటల్లో ఉత్తర–వాయువ్య దిశలో కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తదుపరి 24 గంటల్లో ఈ వ్యవస్థ వాయుగుండం దశకు బలపడే అవకాశాన్ని కూడా అధికారులు ప్రస్తావించారు. ఈ మార్పుల ప్రభావంతో తీర ప్రాంతాల్లో వాతావరణంలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
35
మత్స్యకారులకు కఠిన హెచ్చరిక
రాబోయే కొన్ని రోజులు సముద్రంలో తీవ్ర అలజడి ఉండే అవకాశం ఉన్నందున, గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లినవారు వెంటనే తీరానికి చేరాలని స్పష్టంగా సూచించింది. అల్పపీడన ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో సముద్రంలో గాలి వేగాలు, అలల ఎత్తు గణనీయంగా పెరుగుతాయని అధికారులు తెలియజేశారు.
వాతావరణ మార్పుల దృష్ట్యా శనివారం నుంచి మంగళవారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు తాత్కాలికంగా సంభవించే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో పలు చోట్ల ఈశాన్య గాలులు బలంగా వీస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
55
రైతులకు జాగ్రత్తలు
వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు సాగు పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నిల్వ ఉన్న నీరు, గాలివానల ప్రభావం, పంటలపై పడే తేమ పెరుగుదల వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని దిగుబడికి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చింది. వర్షాల అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఎరువుల వాడకం, కోత పనులు, నీటిమ్యానేజ్మెంట్ వంటి విషయాలలో ముందు జాగ్రత్త అవసరం అని అధికారులు పేర్కొన్నారు.