Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని ఎంపీ కేశినేని చిన్నిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొలికిపూడి శ్రీనివాస్ తో తాము మాట్లాడిస్తున్నామని వస్తున్న ఆరోపణలను ఖండించారు. చిన్నిని మునిగిపోయే నావతో పోల్చిన నాని.. ఆపై ఏమన్నారంటే.?
ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. కొలికిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తితో తాము మాట్లాడిస్తున్నామని జరుగుతున్న ప్రచారాన్ని పేర్ని నాని ఖండించారు. శ్రీనివాసరావును తాను ఇంతవరకు టీవీలో, యూట్యూబ్‌లో తప్పితే ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. ఒకవేళ తాను మాట్లాడాల్సి వస్తే, శ్రీనివాసరావు తనతో మాట్లాడుతున్నారని తానే చెప్తానని నాని కుండబద్దలు కొట్టారు.
25
'మునిగిపోతున్న నావ'లా
ప్రస్తుతం ఎంపీ కేశినేని చిన్ని 'మునిగిపోతున్న నావ'లా కనిపిస్తున్నారని పేర్ని నాని అభివర్ణించారు. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆస్తులపై కన్నేయడమే చిన్ని పతనానికి కారణమని పేర్ని నాని చెప్పారు. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి చాలా మహిమ గల దేవుడని, ఆయన ఆస్తులను ముట్టుకోవడం వల్లే చిన్ని పతనం ప్రారంభమైందని నాని ధ్వజమెత్తారు.
35
ప్రభుత్వ పెద్దలకు కూడా ఇదే గతి..!
గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడి జోలికి వచ్చినందువల్లే చిన్ని పతనం ప్రారంభమైందని.. చిన్నికి సహకరించిన ప్రభుత్వ పెద్దలకు కూడా ఇదే గతి పడుతుందని మాజీ మంత్రి పేర్ని హెచ్చరించారు. ఎంపీ చిన్ని హైదరాబాద్ లో చేసిన పాపాలన్నీ కూడా బయటపడ్డాయన్నారు.
పేకాట తప్ప ఏ ఆట రాని వ్యక్తికి ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారని పేర్ని నాని అన్నారు. కేశినేని చిన్ని ప్రస్తుతం మునిగిపోతున్న నావలా కనిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
55
కౌంటర్ ఎలా ఉండబోతోంది.?
ఇక ప్రస్తుతం ఎంపీ కేశినేని చిన్నిపై పేర్ని నాని చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరి నాని వ్యాఖ్యలపై చిన్ని ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.