pawan kalyan: పవన్ కొడుకు కోలుకోవాలని జగన్‌, రోజా ట్వీట్లు.. షాక్‌లో క్యాడర్‌.. అంటే మీరు మీరు!

Published : Apr 08, 2025, 06:02 PM IST

pawan kalyan vs ys jagan: సింగపూర్‌లోని ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో అక్కడ చదువుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్‌ ప్రత్యేక విమానంలో వైజాగ్‌ నుంచి సింగపూర్‌ బయలుదేరారు. ఈ నేపథ్యంలో పవన్‌ కుమారుడు కోలుకోవాలని సామాజిక మాధ్యమాల్లో ప్రముఖులు, రాజకీయ నేతలు కోరుకుంటున్నారు. అయితే పవన్‌ పేరు ఎత్తగానే ఉవ్వెత్తున ఎగసిపడే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌, మాజీ మంత్రి రోజా, ఇతర వైసీపీ నేతలు పవన్‌ కుమారుడు కోలుకోవాలని సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. అవి చూసిన క్యాడర్‌ ఏమనుకుంటుందంటే... 

PREV
16
pawan kalyan: పవన్ కొడుకు కోలుకోవాలని జగన్‌, రోజా ట్వీట్లు.. షాక్‌లో క్యాడర్‌.. అంటే మీరు మీరు!
Pawan Jagan

పవన్‌ వర్సెస్‌ జగన్‌ వీరి మధ్యవైరం ఈనాటిది కాదు ఏనాటిదో. నాడు ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి దివంగత రాజశేఖర్‌ రెడ్డికి చిరంజీవి, పవన్‌లకు అసలు పడేది కాదు. అప్పట్లోనే ఒకరిపై ఒకరు రాజకీయ, వ్యక్తిగతమైన దూషణలు చేసుకున్నారు. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ పార్టీ పెట్టారు. ఈక్రమంలో జనసేన ఆవిర్బాం జరగడం అన్నీ కొన్ని నెలల వ్యవధిలో జరిగిపోయాయి. 
 

26
pawan jagan

తొలి నుంచి వైసీపీ పార్టీ నేతలు, వైఎస్‌ జగన్‌, ఇటు పవన్‌ కల్యాణ్‌ ఎవరికి వారే అన్నట్లు రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. 2019 వరకు అంతా ప్రశాంతంగానే ఉంది. ఎప్పుడైతే 2019లో వైసీపీ అధికారంలోకి రావడం, ఆ ఎన్నికల్లో పవన్‌ రెండు చోట్లు ఓడిపోవడం, కేవలం ఒక్కసీటుకే పరిమితం కావడంతో రెండు పార్టీల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. అవికాస్త ఓ దశలో అప్పటి సీఎం, నేడు మాజీ సీఎం జగన్‌ పవన్‌ వ్యక్తిగత జీవితంపై అనే సందర్బాల్లో, పబ్లిక్‌ మీటింగ్‌లలో మాట్లాడేవారు. 

36
YCP Janasena

వైసీపీ అధినేత జగన్‌ దారిలోనే ఆ నాడు నడిచిన అనేక మంది మంత్రులు.. ముఖ్యంగా రోజా, పేర్నినాని, ఇతర కాపు నేతలు పవన్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదీ తారాస్థాయికి చేరుకుంది. ఒకవైపు నేతల కామెంట్లకు తోడు.. రెండు పార్టీల క్యాడర్‌ సైతం సోషల్‌ మీడియాలో ఒకరిపై ఒకరు బూతులతో విరుచుకుపడ్డారు. 

46
Pawan Kalyan

మాజీ మంత్రి రోజా పవన్‌ని ఉద్దేశించి సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వమని సవాల్‌ చేశారు. మిగిలిన మంత్రులు పవన్‌ను ఓడించి తీరుతాం అని శపథం చేశారు. ఇక మాజీ సీఎం జగన్‌.. పవన్‌ కల్యాణ్‌ కార్లను మార్చినట్లు పెళ్లాలని మారుస్తాడని వ్యాఖ్యానించారు. రీసెంట్‌గా కూడా పవన్‌ కార్పొరేటర్‌కి ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్‌ సెటైర్లు వేశారు. దీనిపై జనసేన, టీడీపీ పార్టీల నుంచి జగన్‌పై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, అలాగే మిత్రులు ఉండరు అన్న సంగతి మరవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నది విశ్లేషకుల మాట.

56
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇందులో అన్నా లెజ్‌నేవా బరువెక్కడంతో అభిమానులు గుర్తుపట్టలేకపోతున్నారు.

తాజాగా పవన్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ సింగపూర్‌లో గాయపడ్డారు. ఈ ఘటనపై మాజీ సీఎం జగన్‌ స్పందించడం చర్చనీయాంశమైంది. పవన్‌ కొడుకు గాయపడిన సంఘటన విని షాక్‌కి గురయ్యానని, బాబు త్వరగా కోలుకుని ఇంటికి రావాలని, పవన్‌ కల్యాణ్‌ గారి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీసులు ఉండాలని జగన్‌ తన ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు. జగన్‌ ట్వీట్‌ చేసిన వెంటనే మాజీ మంత్రి రోజా కూడా పవన్‌ చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త తన మనసును ఎంతో కలచివేసిందని, ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్ మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత అనేక మంది వైసీపీ నేతలు పవన్‌ కుమారుడు కోలుకోవాలని ట్వీట్‌ చేశారు. 

 

66

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత, నీతి నిజాయతీ ఉండాలని అందరు నాయకులు మైకుల ముందు ఊదరగొడుతుంటారు. కానీ నేడు అన్ని రాజకీయపార్టీల నేతలు, వారి క్యాడర్‌ వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం, కుటుంబంలోని వ్యక్తులను అవమానించడం వంటి సంఘటనలు గతంలో చోటుచేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సంప్రదాయం వల్ల ప్రజల్లో వైషమ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. రీసెంట్‌గా పవన్ కల్యాణ్‌ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. రాజకీయ పరంగా విమర్శలు చేయడం వరకు ఓకే.. కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం తప్పని చెప్పారు. తాజాగా మాజీ సీఎం జగన్‌ ఆపదలో ఉన్న పవన్‌ కొడుకు త్వరగా కోలుకోవాలని కోరుకోవడం వంటివి సొసైటీకి మంచి సందేశాన్ని అందిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయాలు ఇలాగే హుందా ఉంటే నాయకులంటే ప్రజల్లో గౌరవం పెరుగుతుందంటున్నారు. ఇక జగన్ ట్వీట్‌ చేయడంపై జనసేన, టీడీపీ కేడర్‌లో ఆశ్చర్యకరంగా ఉన్నా.. వైసీపీ మాత్రం దీనిని సానుకూలంగా తీసుకుంటోంది. మూడు పార్టీల క్యాడర్‌ మాత్రం ''మీరు మీరు ఎప్పుడూ ఒక్కటేనని కింద గ్రౌండ్‌ లెవల్లో మేము కొట్టుకుచస్తున్నామని చర్చించుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories