AP: డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌.. జిల్లాల వారీగా పోస్టులు ఎన్నంటే!

Published : Apr 07, 2025, 09:56 PM IST

ap dsc notificatio:ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లోనే నోటిఫికేషన్‌ వస్తుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఎట్టకేలకు నోటిఫికేషన్‌ ఇచ్చి తీరాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ నిర్ణయించుకున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలో నోటిఫికేషన్‌ రావాల్సి ఉండగా.. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌ వల్ల కాస్త ఆలస్యం అయ్యింది. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకోగా.. నోటిఫికేషన్‌ విడుదల తేదీని సూచనప్రాయంగా తెలిపారు.  

PREV
15
AP: డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌.. జిల్లాల వారీగా పోస్టులు ఎన్నంటే!
school teacher

ఎస్సీ వర్గీకరణ రోస్టర్‌ పాయింట్లు రాగానే.. 
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం, మెగా డీఎస్సీ ఫైల్‌పై చంద్రబాబు తొలి సంతకం చేశారు. రీసెంట్‌గా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ సైతం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదల చేస్తామన్నారు. అయితే... ఎస్సీ వర్గీకరణ చేపట్టడం వల్ల కాస్త ఆలస్యం అయ్యింది. వర్గీకరణ ఆధారంగా రోస్టర్‌ పాయింట్లు విభజించిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ రానుంది. అయితే.. ఎట్టి పరిస్థితుల్లో మరో నాలుగైదు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ వస్తుందని అధికారుల నుంచి విశ్వసనీయ సమాచారం. ఎస్సీ వర్గీకరణ రోస్టర్‌ పాయింట్లు రాగానే ఒక్కరోజు వ్యవధిలో నోటిఫికేషన్‌ వచ్చేస్తుందని అంటున్నారు. 
 

25

కోచింగ్‌ సెంటర్లలో కుస్తీలు.. 
ఏడాది నుంచి డీఎస్సీ నోటిఫికేషన్‌ వస్తుందని రూ.వేలలో ఫీజులు చెల్లించి లక్షలాది మంది అభ్యర్థులు కోచింగ్‌ తీసుకుంటున్నారు. వీరందరూ డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదల చేస్తారా ఆతృతగా చూస్తున్నారు. ఇప్పటికే వేలకు వేలు ఫీజులు చెల్లించి కోచింగ్‌ సెంటర్లలో పరీక్షలకు సన్నద్దం అవుతున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వం వారందరికీ త్వరలో గుడ్‌ న్యూస్‌ చెప్పేందుకు సిద్దమైంది. ఇప్పటికే టెట్‌ పరీక్షను నిర్వహించి ఫలితాలను కూడా ప్రకటించారు. 

35
school teacher

రాష్ట్ర వ్యాప్తంగా 16,347కుపైగా ఉద్యోగాలు.. 
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ప్రకటించినట్లు రాష్ట్ర వ్యాప్తంగా 16,347కుపైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ కానుంది. దీంతోపాటు ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌కు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆర్డినెన్స్‌ జారీ కాగానే సాధారణ పరిపాలన శాఖ రిజర్వేషన్లపై కొత్త రోస్టర్‌ విడుదల చేయనుంది. దీని ప్రకారం పోస్టులు కేటాయించి తుది నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. అయితే.. మరో నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్‌ ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేస్తారని నిపుణులు చెబుతున్నారు. 

45
school teacher

జిల్లాల వారీగా ఖాళీలు ఇలా.. 
ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ ప్రకారం. మొత్తం 16,347 పోస్టులు ఉన్నాయి. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు 6,371, స్కూల్‌ అసిస్టెంట్లు 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ 1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ 286, ప్రిన్సిపాళ్లు 52, పీఈటీలు 132 పోస్టులు ఉన్నాయి. జిల్లాల వారీగా .. శ్రీ‌కాకుళం  543, విజ‌య‌న‌గ‌రం 583, విశాఖ‌ప‌ట్నం 1,134, తూర్పుగోదావ‌రి 1,346, ప‌శ్చిమ గోదావ‌రి 1,067, కృష్ణా 1,213, గుంటూరు 1,159, ప్రకాశం 672, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 673, చిత్తూరు 1,478, వైఎస్సార్‌ క‌డ‌ప‌ 709, అనంత‌పురం 811, క‌ర్నూలు 2,678 ఖాళీలు భర్తీ చేయనున్నారు. గురుకుల, మోడల్‌ స్కూళ్లు, బీసీ, గిరిజ‌న పాఠశాలల్లో 2,281 ఖాళీలు ఉన్నాయి. 

 

55
school teacher

జూన్‌లోనే ఉద్యోగాల్లో చేరేలా.. 
కొన్ని సాంకేతిక కారణాలు, ఎమ్మెల్సీ కోడ్‌ అమలుతో పాటు అభ్యర్థుల వయసు పెంపు తదితర సమస్యలపై స్పష్టమైన నిర్ణయం రావాల్సి ఉన్నందున డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటన వాయిదా పడుతోంది. ఇక జూన్‌లోపు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సాక్ష్యాత్తు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ చెప్పడంతో ఇప్పుడు ఏ క్షణం అయినా నోటిఫికేషన్‌ విడుదలయ్యేందుకు చాన్స్‌ ఉంది. ఎందుకంటే జూన్‌ అంటే కేవలం రెండు నెలల సమయమే ఉండటంతో వీలైనం త్వరగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తే పరీక్షలు నిర్వహణ, ఇతర ఏర్పాట్లుకు అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అభ్యర్థులందరికీ పరీక్షకు బీ రెడీ అన్న సంకేతం వచ్చేసిందని చెప్పవచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories