Published : Apr 08, 2025, 12:25 PM ISTUpdated : Apr 08, 2025, 12:27 PM IST
Pawan kalyan: సినిమాలు చేయడంలో డైలాగులు చెప్పడంలోనే కాదు.. రాజకీయాల్లో కూడా తనకంటూ ఓ లెక్కుందని డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రూవ్ చేస్తున్నారు. సింగపూర్‌లో చదువుకుంటున్న అతని చిన్న కుమారుడు అగ్నిప్రమాదం బారిన పడి తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సాధారణంగా ఈ విషయం తెలుసుకున్న వెంటనే పవన్ హుటాహుటిన ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన అలా చేయలేదు. మన్యం ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్ ఇచ్చిన మాట కోసం నిలబడిపోయారు. దీనిపై మంత్రి నారా లోకేష్, గిరిజనులు, జనసేన నాయకులు ఏమంటున్నారో తెలుసా?
కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి..
అడవితల్లి బాట పేరుతో ఏపీలోని మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఏప్రిల్ 7, 8 తేదీల్లో కార్యక్రమాలు ఫిక్స్ అయ్యాయి. గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయడం, తాగునీటి వెతలు తీర్చడం, ఇతర సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పవన్ పెట్టుకున్నారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా తీసుకొచ్చారు. దాదాపు వెయ్యి కోట్లను కేవలం గిరిజన ప్రాంత అభివృద్ది కోసం కేంద్రం నుంచి పవన్ రాబట్టారు.
25
పవన్‌కు ఓట్లు, సీట్లు రాకపోయినా..
గిరిజన ప్రాంతాలపై పవన్ కల్యాణ్‌కు మమరాకం ఎక్కువే అని చెప్పాలి. నిన్న ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించిన మాట్లాడుతూ.. 'అడవినే నమ్ముకున్న గిరిపుత్రుల గురించి మనసుతో ఆలోచిస్తాం. వారి అభివృద్ధి, అభ్యున్నతి కోసం నిత్యం తపిస్తాం. మాకు ఓట్లు, సీట్లు ముఖ్యం కాదు. గిరి పుత్రుల సంపూర్ణ అభివృద్ధి, జీవనశైలి పెంపుదల ముఖ్యం’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు. వాస్తవానికి అరకు ఎంపీ సీటు వైసీపీ దక్కించకుంది. దీంతోపాటు అక్కడి అన్ని పంచాయతీల్లో వైసీపీ కైవసం చేసుకుంది. కూటమి పార్టీకి ఓట్లు కూడా అక్కడ రాలేదు. అయినా కూడా గిరిజనుల బాగోగుల పట్ల పవన్ కమిట్‌మెంట్ చూస్తే ఎవరైనా అభినందించాల్సిందే.
35
ఇచ్చిన మాట కోసం నిలబడే మనిషిని అంటూ..
పవన్ మాట్లాడుతూ.. "నేను మాటమీద నిలబడే మనిషిని. గిరిజనులు అంటే ఓట్లు.. సీట్లు అని ఎప్పుడూ చూడను. అడవి అంటే నాకు ప్రాణం. పచ్చని చెట్లను చూస్తే మనసు పులకిస్తుంది. అడవిని నమ్ముకుని బతికే గిరిబిడ్డల బతుకులను చూస్తే ఆవేదన కలుగుతుంది. 2018 పోరాట యాత్ర సమయంలో అరకులో వారం రోజుల పాటు పర్యటించాను. ఆ సమయంలో అడవి బిడ్డల కోసం ఏదైనా చేయాలని బలంగా సంకల్పించాను. వీరి వెతలు తీర్చేందుకు అధికారం ఉంటే బాగుంటుందని, గిరిపుత్రుల కోసం అధికారం ఇవ్వమని దేవుళ్లను కోరాను. అనుకున్నట్లే ప్రజలు బలమైన నమ్మకంతో కూటమిని అధికారంలో నిలబెట్టారు. మూడు నెలల క్రితం ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించినప్పుడు రోడ్ల సమస్య తీవ్రంగా ఉందని వాటి పరిష్కరించేందుకు పక్కా ప్రణాళికతో వస్తానని మాటిచ్చాను''. ఇప్పుడు నిధులు తీసుకుని వచ్చాను అని పవన్ చెప్పడంతో గిరిజనులు పులకరించిపోయారు.
45
Pawan Kalyan
ఊపిరి తీసుకోని స్థితిలో పవన్ కొడుకు... అయినా..
సింగపూర్‌లో చదువుకుంటున్న పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. లంగ్స్‌లోకి పొగ వెళ్లడంతో ఊపిరి తీసుకోవడంలో శంకర్ కాస్త ఇబ్బందులు పడుతున్నాడంట. ఇలాంటి స్థితిలో కూమారుడు ఉన్నప్పటికీ.. తన గిరిజన ప్రాంతాల్లో పర్యటనను పవన్ రద్దు చేసుకోలేదు. తాను వస్తానని గిరిపుత్రులకు మాట ఇచ్చానని, వారు తన కోసం ఎదురుచూస్తుంటారని అధికారులతో పవన్ చెప్పారంట. కార్యక్రమం రద్దు చేయకుండా కొనసాగించాలని చెప్పారంట పవన్. డిప్యూటీ సీఎం కమిట్‌మెంట్ చూసి అందరూ షాక్‌కి గురవుతున్నారు.
55
chandrababu naidu -pawan kalyan -lokesh
ఘటనపై స్పందించిన లోకేష్..
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పవన్ కొడుక్కి గాయాలు కావడంపై స్పందించారు. ఘటన గురించి తెలిసి షాక్‌కి గురయ్యానని లోకేష్ అన్నారు. పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అరకు పర్యటనలో ఉన్న పవన్ ఇవాళ సాయంత్ర విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పవన్ సింగపూర్ వెళ్లనున్నారు.