తనయుడి చేతిలోకి టీడీపీ: నారా లోకేష్ పాదయాత్ర?

First Published Aug 26, 2020, 6:08 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర ఓ సెంటిమెంట్ గా మారింది. పాదయాత్ర చేసిన నాయకుడు అధికారంలోకి వస్తాడనే నమ్మకం పెరిగింది. ఎన్టీ రామారావు మొదలు పెట్టిన పాదయాత్ర ఆ తర్వాత పాపులర్ అయింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర ఓ సెంటిమెంట్ గా మారింది. పాదయాత్ర చేసిన నాయకుడు అధికారంలోకి వస్తాడనే నమ్మకం పెరిగింది. ఎన్టీ రామారావు మొదలు పెట్టిన పాదయాత్ర ఆ తర్వాత పాపులర్ అయింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు.
undefined
ఆ తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేశారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. తాజాగా వైసీపీ అధ్యక్షుడు పాదయాత్ర చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన చేస్తున్నారు
undefined
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. సైకిల్ యాత్ర చేయాలా, పాదయాత్ర చేయాలా అనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, పాదయాత్ర వైపే ఆయన మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నారా లోకేష్ పాదయాత్రపై సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం సాగుతోంది
undefined
పాదయాత్ర ద్వారా పార్టీ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవడంతో పాటు పార్టీని బలోపేతం చేయాలని, కార్యకర్తల్లో విశ్వాసం కలిగించాలని నారా లోకేష్ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. దాదాపు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం ద్వారా ప్రజల మనసులను దోచుకోవడంతో పాటు వైఎస్ జగన్ చేస్తున్న తప్పులను ఎత్తి చూపాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు
undefined
అయితే, నారా లోకేష్ పాదయాత్ర ఇప్పట్లో ఉండకపోవచ్చునని అంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన 14 నెలలు అవుతోంది. ఎన్నికల ఏడాది ముందో, లేదంటే దాని కన్నా కొంచెం ముందు పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని నారా లోకేష్ భావిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొత్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఆగిపోయిన తర్వాత ఆయన పాదయాత్ర ఉండవచ్చునని అంటున్నారు
undefined
అయితే, నారా లోకేష్ కు పాదయాత్ర అనేది నల్లేరు మీద నడక కాకపోవచ్చు. జగన్ ప్రభుత్వంపై మాటల ఈటెలు రువ్వుతూ పోరాటం చేస్తున్న అచ్చెన్నాయుడు జైలు పాలయ్యారు. కొల్లు రవీంద్ర హత్య కేసులో చిక్కుకున్నారు. వల్లభనేని వంశీ వంటి కొంత మంది ఎమ్మెల్యేలు వైసీపీకి అనుకూలంగా మారారు. ఈ స్థితిలో నారా లోకేష్ పాదయాత్ర చేయడం అంత సులభం కాకపోవచ్చునని అంటున్నారు
undefined
click me!