బిజెపి సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్: చిరంజీవితో సోము వీర్రాజు భేటీ సీక్రెట్ ఇదే...

First Published | Aug 25, 2020, 4:59 PM IST

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సోము వీర్రాజు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీని పటిష్టపరిచేందుకు గాను జనసేన పార్టీతో కలిసి కలిసి ముందుకు సాగాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సోము వీర్రాజు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీని పటిష్టపరిచేందుకు గాను జనసేన పార్టీతో కలిసి కలిసి ముందుకు సాగాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. దీనిలో భాగంగా వెను వెంటనే మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రముఖుల్ని కలుస్తున్నట్లు తెలిపారు.
కాగా 2019 ఎన్నికల తర్వాత జగన్ సంక్షేమ పథకాల అమలులో దూకుడు చూపిస్తుండటంతో ప్రజల్లో ఆయన ఛరిష్మా పెరుగుతోంది. ఇదే స్పీడును 2024 వరకు చూపిస్తే మళ్లీ జగన్ సీఎం అయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ బలహీనపడినట్లు గత ఎన్నికల్లో తేలిపోయింది. 2019 ఎన్నికల నాటికి టీడీపీ చీఫ్ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తారో వేచి చూడాలి.

ఇక జనసేతో బీజేపీ మైత్రితో పాటు మెగా హీరోలతో భేటీపై సోము వీర్రాజు ఎలాంటి దాపరికాలు ప్రదర్శించడం లేదు. పవన్ ఇప్పటికే తమ మిత్రపక్షమని ప్రకటించిన వీర్రాజు.. ఆయనకు రాబోయే రోజుల్లో కీలకమైన బాధ్యతను అప్పగించే అవకాశం ఉన్నట్లు గా వస్తున్న వార్తలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ బాధ్యతలు కావాలని అడిగే వ్యక్తి కాదని.. అసలు వారి స్వభావమే అది కాదని కుండబద్ధలు కొట్టారు. కానీ ఏపీ రాజకీయాల్లో ఆయన ప్రభావిత వ్యక్తని సోము అన్నారు. అలాగే ఆయన ఆలోచనలు, మోడీ ఆలోచనలు ఒకేలా ఉంటాయని.. మోడీ ఇజం- పవనిజం రెండింటీని స్ట్రాంగ్ ఫోర్స్‌గా తయారు చేయబోతున్నామన్నారు. ఒకవేళ పార్టీ పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటిస్తే ఆ విధంగానే ముందుకు వెళ్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
మరోవైపు పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే, తమ్ముడు కంటే రాజకీయాల్లో, సినిమాల్లో కాస్త సీనియర్. ఏ రకంగా చూసుకున్నా పవన్ రాజకీయ వ్యూహాలకంటే చిరు వ్యూహాలే ఎక్కువగా ఫలించాయని చెప్పొచ్చు. పవన్‌కి జనసేన పార్టీ ద్వారా ఒక్క సీటు మాత్రమే వస్తే, చిరంజీవి తాను గెలవడంతో పాటు మరో 18 మందిని గెలిపించుకున్నారు. ఆ తరువాత కేంద్ర మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో తన హవా చూపించారు.
అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నేరుగా మెగాస్టార్‌ని కలవడంతో , చిరంజీవి బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది. దీనిపైనా సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాజకీయాల్లో కొన్ని బంధాల్ని, అనుబంధాల్ని కొనసాగించాలని, రిలేషన్స్ పెంచుకోవాలన్నారు. క్రికెట్‌లో ఏది సిక్సో, ఏది ఫోరో కొడితేనే కాని తెలియదని రాజకీయాలు కూడా అంతేనని వీర్రాజు అభివర్ణించారు. ఏపీలో బీజేపీకి ఒక్క శాతం మాత్రమే ఓటు బ్యాంక్ వుందని అంటున్నారని.. కానీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనన్నారు.

Latest Videos

click me!