కాలేజీ రోజుల్లో చంద్రబాబునే చితక్కొట్టాడు... పెద్దిరెడ్డి మామూలోడు కాదంటున్న జగన్

First Published | Jul 26, 2024, 6:37 PM IST

ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య వైరం కేవలం రాజకీయంగానే కాదట...  కాలేజీనాటిది కాదంటూ మాజీ సీఎం  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేసారు.  

ys jaganmohan Reddy

అమరావతి : వాళ్ళిద్దరూ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పగల నాయకులు. ఇద్దరూ ఉమ్మడి చిత్తూరు జిల్లాకే చెందిన వారు. కానీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు... ఇద్దరిమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి శతృత్వం. ఒకరు అధికారంలో వున్నప్పుడు మరొకరిపై కక్ష సాధించడం ఎప్పటినుండో జరుగుతోంది. ఇప్పటికే మీకు అర్థమైవుంటుంది ఆ ఇద్దరు టాప్ నాయకులు ఎవరో. ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు  నాయుడు కాగా మరొకరు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.  

peddireddyy ramachandra reddy

అయితే తాజాగా మరోసారి చంద్రబాబు, పెద్దిరెడ్డి మధ్య వివాదం తెరపైకి వచ్చింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనను టిడిపి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. స్వయంగా రాష్ట్ర డిజిపి రంగంలోకి దిగి దగ్దమైన కార్యాలయాన్ని పరిశీలించారు...అగ్నిప్రమాద ఘటనపై విచారణను సిఐడికి అప్పగించారు.  దీన్నిబట్టే ఈ ఘటనను చంద్రబాబు సర్కార్ ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థమవుతోంది. 

Latest Videos


Nara Chandra Babu

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగింది కాదు... కావాలనే చేసారని ప్రభుత్వం అనుమానిస్తోంది. కీలకమైన పత్రాలను మాయం చేసేందుకే ఈ ఫైర్ యాక్సిడెంట్ నాటకం ఆడారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి వున్నారనే ప్రచారం జరుగుతుంది. వారి అవకతవకలు బయటపడకుండా సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక దస్త్రాలున్న గదికి మంట పెట్టారంటూ ప్రచారం జరుగుతోంది. 
 

YS Jaganmohan Reddy

ఈ వ్యవహారంపై తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ... సీఎం చంద్రబాబు  నాయుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై కక్షసాధింపు దోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇందుకు ఇద్దరి మధ్య రాజకీయ వైరం కారణం కాదు...గతంలో జరిగిన వ్యక్తిగత గొడవలే కారణమంటూ మాజీ సీఎం ఆసక్తిగత కామెంట్స్ చేసారు.

chandrababu naidu

చంద్రబాబు నాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకే జిల్లాకు చెందినవారే కాదు... ఒకే సమయంలో ఎస్వీ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆ రోజుల్లో ఇద్దరూ స్టూడెంట్ లీడర్లుగా కొనసాగారు. ఈ సమయంలోనే ఓసారి ఇద్దరి మధ్య గొడవ జరిగిందట...  చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టాడట. దీన్ని ఇప్పటికీ మనసులో పెట్టుకుని చంద్రబాబు కక్షసాధింపు చర్యలుకు దిగారని జగన్ పేర్కొన్నారు. 

Chandrababu Naidu

పెద్దిరెడ్డిపై చంద్రబాబుకు పీలక దాక కోసం వుందని జగన్ అన్నారు. అందువల్లే పెద్దిరెడ్డి  కుటుంబాన్ని నాశనం చేయాలని... రాజకీయంగా తొక్కేయాలని చంద్రబాబు చూస్తున్నాడని అన్నారు. ఆయన ఏ శాఖను నిర్వహించిన దాన్నే చంద్రాబాబు టార్గెట్ చేస్తుంటాడని అన్నారు. ఇలా చంద్రబాబు, పెద్దిరెడ్డి కాలేజీ గొడవకు... ప్రస్తుత పరిణామాలను లింక్ పెట్టారు మాజీ సీఎం, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 

click me!