ఎకరానికి 99 వేల రూపాయలు... చంద్రబాబు సర్కార్ బంపరాఫర్

First Published | Jul 25, 2024, 9:38 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతల కోసం సరికొత్త పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా రైతులకు లక్షల రూపాయల లబ్ది చేకూరుతుందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇంతకూ ఆ పథకం ఏమిటో తెలుసా? 

Atchannaidu

Amaravathi : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతుల కోసం ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పాడి రైతులే కాదు ఇతర చిన్న,సన్నకారు రైతులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పోందవచ్చని తెలిపారు. పాల దిగుబడి పెంచడంతో పాటు రైతుల సంక్షేమంలో భాగమే 'ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు' పథకాన్ని అమలు చేస్తున్నామని వ్యవసాయ మంత్రి వెల్లడించారు. 

Farmer

పేద రైతుల జీవనోపాధి మెరుగుపరిచేలా ఈ పథకం వుందన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పథకంలో చేరాలనుకునే రైతులు వ్యవసాయ అధికారులకు సంప్రదించాలని మంత్రి సూచించారు. 
 

Latest Videos


Farmer

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పాడి రైతులకు తోడ్పాటు అందించేందుకు ఈ "ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు"  పథకం అమలు చేసామని మంత్రి తెలిపారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని నిలిపివేసారని అన్నారు. ఈ పథకం అమలు చేయకపోగా పాల సేకరణలో నిబంధనలు విధించి పాడి రైతులను ఇబ్బందులకు గురి చేశారని అచ్చెన్నాయుడు అన్నారు.
 

Farmer

ఉపాధి హామీ పథకంలో ఊరూరా పశుగ్రాస క్షేత్రాల పెంపకం కార్యక్రమాన్ని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తోందని వ్యవసాయ మంత్రి తెలిపారు. ఈ పథకంలో భాగంగా చిన్న మరియు సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులు పశుగ్రాసం పెంచడానికి అర్హులని తెలిపారు. తమ భూమిలో కనీసం 25 సెంట్ల నుండి 2.5 ఎకరాల వరకు పశుగ్రాసంను పెంచవచ్చని తెలిపారు. నిర్ణీత పొలంలో దుక్కిదున్నడం, విత్తనాలు వేయడం,నీటి సరఫరా మరియు ఎరువుల కోసం ఆర్థిక ప్రోత్సాహం ప్రభుత్వమమే అందిస్తుందని అన్నారు. 
 

Farmer

ఈ పథకం ద్వారా పశుగ్రాసం పండించిన రైతుకు ఎకరాకు రూ.99వేల లబ్ది చేకూరుతుందని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం అమలు చేయాలని ఉపాధి హామీ, పశు సంవర్ధక శాఖ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.

click me!