తిరుపతి : అవినీతి కేసులో అరెస్టయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గత నెలరోజులకు పైగా జైల్లోనే వుంటున్నాడు. టిడిపి అధికారంలో వుండగా స్కిల్ డెవలప్ మెంట్ పేరిట స్కాం జరిగిందని... ఇందులో ప్రధాన పాత్ర ఆనాటి సీఎం చంద్రబాబుదే అని వైసిపి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు సిఐడితో స్కిల్ స్కాం పై విచారణ జరిపించి చంద్రబాబును అరెస్ట్ చేయించారు. దీంతో తండ్రి, భర్త ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాలంలోనే కాదు ఏనాడూ రాజకీయాల జోలికి రాని నారా భువనేశ్వరి ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో పార్టీని ముందుండి నడపాల్సి వస్తోంది.