మరింత క్షీణించిన చంద్రబాబు ఆరోగ్యం... తాజాగా ఈ అనారోగ్య సమస్యలు కూడా తీవ్రమయ్యాయట...

Published : Oct 27, 2023, 08:20 AM ISTUpdated : Oct 27, 2023, 08:23 AM IST

రాజమండ్రి సెంట్రలో జైల్లో వున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అనారోగ్య సమస్యలు రోజురోజుకు మరింత తీవ్రం అవుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో వుంచుకుని బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును కోరుతున్నారు. 

PREV
16
మరింత క్షీణించిన చంద్రబాబు ఆరోగ్యం...  తాజాగా ఈ అనారోగ్య సమస్యలు కూడా తీవ్రమయ్యాయట...
chandrababu naidu

రాజమండ్రి : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి నెలరోజులకు పైనే అయ్యింది. ఇలా చాలాకాలంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా వున్న ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వయసు మీదపడిన చంద్రబాబును అనేక రకాల ఆరోగ్య సమస్యలు  వెంటాడుతున్నాయని వైద్యుల నివేదిక బట్టి తెలుస్తోంది. 
 

26
Chandrababu naidu

చంద్రబాబు కంటి సమస్యతో బాధపడుతున్నాడని... వెంటనే ఆయనకు ఆపరేషన్ అవసరమని డాక్టర్లు సూచించినా జైలు అధికారులు బయటపెట్టడం లేదని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 21 న చంద్రబాబుకు హైదరాబాద్  ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్లో ఎడమ కంటికి శస్త్రచికిత్స జరిగింది. మూడు నెలల్లో కుడి కంటికి కూడా శస్త్ర చికిత్స జరగాల్సి వుంది. ఇంతలోనే ఆయన అరెస్టయి జైలుకు వెళ్లడంతో శస్త్రచికిత్స జరగలేదు. ఈ క్రమంలోనే ఆయన కంటి సమస్య తీవ్రమైనట్లు... వైద్యులు సైతం ఆయనకు శస్త్రచికిత్స అవసరమని సూచించారని టిడిపి నాయకులు చెబుతున్నారు. కానీ రాజమండ్రి జైలు అధికారులు మాత్రం వైద్యుల నివేదికను బయటపెట్టకుండా చంద్రబాబుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని టిడిపి నాయకులు అంటున్నారు. 

36
chandrababu naidu

ఇక రాజమండ్రిలో ఉక్కపోత వాతావరణం కారణంగా డీహైడ్రేషన్ కు గురవడమే కాదు చర్మ సంబంధిత సమస్యతో చంద్రబాబు బాధపడ్డారు. అయితే కోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు ఏసి సదుపాయం కల్పించడంతో డీహైడ్రేషన్ తప్పింది... కానీ  చర్మ సమస్య మాత్రం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఒంటిపై దద్దుర్లు మరింత ఎక్కువై నడుం కిందవరకు విస్తరించినట్లు తెలుస్తోంది. చల్లటి వాతావరణం వుంటూ  శరీరానికి బాగా గాలితగిలే దుస్తులను ధరిస్తే ఈ దద్దుర్లు తగ్గే అవకాశాలున్నాయని డాక్టర్లు సూచించారట. 

46
chandrababu

చంద్రబాబు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన భార్య భువనేశ్వరి ములాఖత్ అనంతరం చంద్రబాబు సరిగ్గా కూర్చోలేకపోతున్నారని తెలిపారు. వైద్యులు కూడా చంద్రబాబు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తేల్చినట్లు తెలుస్తోంది. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవద్దని... సౌకర్యవంతంగా వుండే కుర్చీ వాడాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. 

56
chandrababu naidu

ఇక చంద్రబాబు మల ద్వారం వద్ద నొప్పితో బాధపడుతున్నట్లు వైద్యులు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఇలా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబు పలు రకాల వైద్య పరీక్షలు సూచించారట. కానీ ప్రభుత్వ ఒత్తిడితో రాజమండ్రి జైలు అధికారులు వైద్యుల నివేదికను బయటపెట్టడం లేదని... చంద్రబాబు ఆరోగ్యంగానే వున్నాడని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.  

66
bhuvaneshwari

చంద్రబాబు ఆరోగ్య సమస్యలపై ఆయన కుటుంబ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. 

click me!

Recommended Stories