కొంతకాలం తర్వాత దుస్తులు లేకుండా వీడియో కాల్స్ చేయాలని ఒత్తిడి చేశారని, నిరాకరించడంతో తన ఉద్యోగం, తన కుమారుడి భద్రతపై బెదిరింపులు మొదలయ్యాయని మహిళ ఆరోపించింది. 2024 జూలైలో కలవడానికి బలవంతం చేయగా, భయంతో అంగీకరించానని తెలిపింది. రాజంపేట సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో కారులో తనపై బలవంతంగా దాడి చేశారని, బయటపెడితే కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించారని వీడియోలో చెప్పుకొచ్చింది.
గర్భధారణ, అబార్షన్‌లపై ఆరోపణలు
ఈ వ్యవహారం కారణంగా గర్భం దాల్చానని, విషయం తెలిసిన వెంటనే అబార్షన్ చేయించుకోవాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేశారని మహిళ ఆరోపించింది. పెళ్లి చేస్తానని నమ్మించి అబార్షన్ చేయించారని, ఏడాదిన్నర కాలంలో ఐదు సార్లు అబార్షన్ జరిగిందని ఆరోపించింది. తన భర్తకు ఫోన్ చేసి విడాకులు ఇవ్వాలని బెదిరించడంతో కుటుంబం తనను దూరం పెట్టిందని, కుమారుడు కూడా తన వద్ద లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేసింది.
రాజకీయ ప్రతిస్పందనలు, ఖండనలు, ఎదురుదాడులు
ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీల స్పందిస్తూ, తన కుమారుడు అమాయకుడని, ఆ మహిళే కుటుంబాన్ని వేధించిందని పేర్కొన్నారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. ఇక ఎమ్మెల్యే అనుచరులు ఈ వీడియోలను డీప్‌ఫేక్‌గా అభివర్ణిస్తూ, ఇది పక్కా కుట్ర అని అంటున్నారు. అరవ శ్రీధర్ కూడా వీడియో విడుదల చేసి, తనపై ఫేక్ ఆరోపణలు చేస్తున్నారని, న్యాయపరంగా పోరాడతానని స్పష్టం చేశారు. బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళ తనను వేధించిందని ఆయన చెప్పుకొచ్చారు. మరి ఈ వ్యవహారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే విచారణ పూర్తయ్యే వరకు చూడాల్సిందే.