నేను కూడా చేనేత కుటుంబ కోడలినే: ఆప్కో సమ్మర్ సారీ మేళాలో మంత్రి రోజా

First Published May 12, 2022, 2:53 PM IST

చేనేత కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. విజయవాడలోని  పిన్నమనేని పాల్ క్లినిక్ రోడ్‌లోని ఆప్కో సమ్మర్ సారీ మేళాను గురువారం మంత్రి రోజా ప్రారంభించారు. 

చేనేత కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. విజయవాడలోని  పిన్నమనేని పాల్ క్లినిక్ రోడ్‌లోని ఆప్కో సమ్మర్ సారీ మేళాను గురువారం మంత్రి రోజా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆప్కో సమ్మర్ సారీ మేళాకి పిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు.  రాష్ట్రం నలుమూలలా ఆప్కో షోరూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమ్మర్‌ శారీ మేళా ద్వారా మహిళలకు 30శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నారని పేర్కొన్నారు. 

చీరలు, చుడీదార్‌లు, పెళ్లి బట్టలు చాలా రకాల వెరైటీల్లో దొరుకుతున్నాయన్నారు. మహిళల మనసు దోచే విధంగా ఆప్కోలో చీరలు ఉన్నాయన్నారు. బయట షోరూమ్‌లకు ధీటుగా ఆప్కో షోరూమ్‌లు ఉన్నాయని రోజా చెప్పారు. 
 

ప్రత్యేక ఆఫర్లతో ఆప్కో షోరూమ్ అందరినీ ఆకట్టుకుంటుందని రోజా అన్నారు. చేనేత కుటుంబాలకు జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఏడాది రూ.24 వేలు నేతన్న చేనేత పథకం కింద అందిస్తున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు.

తాను కూడా చేనేత కుటుంబ కోడలినని మంత్రి రోజా తెలిపారు. నేతన్నలకు ఆర్ధిక చేయూత ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక పథకాలు అందిస్తున్నారని  అన్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నేతన్నలకు సహకరిద్దామని ఆర్కే రోజా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, ఎండీ నాగరాణి తదితరులు పాల్గొన్నారు. 

ఇక,  రోజా.. గతంలో కూడా ఆప్కో షోరూమ్స్‌లో షాపింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో విజయవాడలో ఆప్కో మెగా షోరూమ్‌కు వెళ్లిన రోజా.. పెద్దఎత్తున చీరలు కొనుగోలు చేశారు. యువత కూడా చేనేత వస్త్రాలను ధరించి.. నేతన్నలకు ప్రోత్సాహం ఇవ్వాలని రోజా పిలుపునిచ్చారు. చేనేత వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
 

click me!