Chandrababu: ఢిల్లీ పెద్దల దృష్టి మొత్తం సీఎం చంద్రబాబు వైపే.. ఎందుకంటారు.? మన ముఖ్యమంత్రిని ఆకాశాన్ని ఎత్తేశారు సెంట్రల్ మినిస్టర్లు. పొగడ్తల వర్షం కురిపించారు. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.
ఢిల్లీలో కేంద్ర పెద్దల దృష్టి అంతటిని తన వైపు తిప్పుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశ రాజధానిలో జరిగిన ప్రతిష్టాత్మక 'భారత్ AI శక్తి' కార్యక్రమంలో విశాఖపట్నంలో భారతదేశంలో మొట్టమొదటి AI హబ్‌ను స్థాపించడానికి గూగుల్, దాని అనుబంధ సంస్థ రైడెన్‌తో అధికారికంగా ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతకం చేసింది.
25
సీఎం చంద్రబాబుకు అద్దిరిపోయే మాస్ ఎలివేషన్
ఈ ఒప్పందం కంటే ఎక్కువ ప్రత్యేకంగా నిలిచింది ఏమిటంటే.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రుల నుంచి సీఎం చంద్రబాబుకు అద్దిరిపోయే మాస్ ఎలివేషన్ వచ్చింది. చంద్రబాబు దూరదృష్టి, ఆవిష్కరణలు, భవిష్యత్తు ఆలోచనలపై ఎక్కువగా దృష్టి పెడతారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రశంసించారు.
35
వైజాగ్.. భవిష్యత్తు ఐటీ హాబ్
చంద్రబాబు దార్శనికతను నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. ఏఐ హబ్ స్థాపనను సంబంధించిన ఒప్పందం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందన్నారు. అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన వైజాగ్.. భవిష్యత్తులో ఐటీ హాబ్‌గా మారుతుందని, మరే ఇతర రాష్ట్రంలోనూ ఇలాంటి మౌలిక సదుపాయాలు సమపాళ్ళలో ఉన్న తీరప్రాంతం లేదని నిర్మలా సీతరామన్ అన్నారు. వైజాగ్ కేంద్రంగా పెట్టుబడులను ఆకర్షించడానికి చంద్రబాబు వ్యూహాత్మక ప్రణాళిక అద్భుతమని కొనియాడారు.
గూగుల్, రైడెన్‌తో భాగస్వామ్యం రాష్ట్రానికి ఒక మైలురాయి
'ఆరు నెలల క్రితం మంత్రి నారా లోకేష్ నన్ను కలిసి ఈ ప్రాజెక్టు గురించి చర్చించారు. చాలా రాష్ట్రాలు మాకు ప్రతిపాదనలు తెచ్చాయి, కానీ ఆంధ్రప్రదేశ్ దానిని అద్భుతమైన వేగంతో సాధ్యం చేసింది. ఈ చొరవ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును రూపొందించడమే కాకుండా అభివృద్ధి చెందిన భారత్ దార్శనికతకు దోహదపడుతుంది” అని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఇక ఈ ప్రాజెక్టును అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన నారా లోకేష్ మాట్లాడుతూ.. గూగుల్, రైడెన్‌తో భాగస్వామ్యం రాష్ట్రానికి ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. కొత్త AI కేంద్రం అవకాశాలు, ఉద్యోగాలు, ఆవిష్కరణలను సృష్టిస్తుందని.. సాంకేతిక ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్‌ను ముందుండేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
55
ప్రపంచ టెక్ దిగ్గజాలకు ఒకే ఒక్క గమ్యస్థానం
ఒకప్పుడు ప్రధాన పెట్టుబడులను ఆకర్షించడంలో ఇబ్బంది పడుతున్న రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రపంచ టెక్ దిగ్గజాలకు ఒకేఒక్క గమ్యస్థానంగా మారింది. చంద్రబాబు నాయకత్వం మరోసారి భారతదేశ డిజిటల్ పరివర్తనలో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపింది. ఢిల్లీలో జరిగిన ఈ ఏఐ కార్యక్రమం స్పష్టంగా ఏపీ ముఖ్యమంత్రికి మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. జాతీయ వేదికపై మరోసారి సీఎం చంద్రబాబు తన సత్తా ఏంటో చాటి చెప్పారు.