ఎంతమంది ఉన్నా జగన్ ఒక్కడే: రికార్డు

First Published May 30, 2019, 12:01 PM IST

ముఖ్యమంత్రిగా కొడుకు నుండి  అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఎన్నిక కావడం వైఎస్ జగన్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎవరి కొడుకు కూడ సీఎంగా ఇంతవరకు బాధ్యతలను చేపట్టలేదు.

1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పటివరకు 16 మంది సీఎంలుగా పని చేశారు. కొందరు ఈ రాష్ట్రానికి రెండు దఫాలు సీఎంగా కూడ పనిచేశారు.
undefined
ఉత్తర భారతంలో మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు అనేక మంది ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇదే తరహా సంప్రదాయం దక్షిణాదిలో కూడ ప్రారంభమైంది. జేడీ(ఎస్) చీఫ్ మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవేగౌడ తనయుడు హెచ్ డీ కుమారస్వామి కర్ణాటక సీఎంగా ఎన్నికయ్యారు.
undefined
ప్రస్తుతం కర్ణాటకలో జేడీ(యూ), కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలో కొనసాగుతోంది.గతంలో కూడ 1994 నుండి 1996 వరకు కుమారస్వామి కర్ణాటక రాష్ట్రానికి సీఎంగా కూడ పనిచేశారు.
undefined
ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి 2004 లో తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2009లో కూడ వైఎస్ఆర్ రెండో దఫా సీఎంగా ఎన్నికయ్యారు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించే సమయం వరకు వైఎస్ఆర్ సీఎంగా కొనసాగారు.
undefined
జగన్ మినహా ఇతరులెవరూ కూడ ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేయలేదు. 2009 నుండి వైఎస్ జగన్ క్రియాశీలక రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు.కాంగ్రెస్ పార్టీతో విబేధించి వైఎస్ఆర్‌సీపీని ఏర్పాటు చేసి కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మలు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుండి వైఎస్ జగన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
undefined
వైఎస్ జగన్‌ వైసీపీని ఏర్పాటు చేసిన సమయంలో ఆయన అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జగన్‌పై కేసులు నమోదయ్యాయి. సీబీఐ, ఈడీ కేసులు జగన్‌పై కేసులున్నాయి.
undefined
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేత పి. శంకర్ రావు రాసిన లేఖ ఆధారంగా కేసులు నమోదయ్యాయి.ఆ తర్వాత వైఎస్ జగన్ మాత్రం ఏ మాత్రం జంకకుండా పార్టీని నడిపించారు.2014 ఎన్నికల్లో ఓటమి పాలైనా... 2019 ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్ ఘన విజయం సాధించారు.
undefined
click me!