తటస్థులంతా జగన్ వైపే: కుప్పకూలిన టీడీపీ

First Published May 30, 2019, 10:57 AM IST

నెల్లూరు జిల్లాలో కొత్త ఓటర్లు, తటస్థ ఓటర్లు వైఎస్ఆర్‌సీపీ జై కొట్టారు. దీంతో ఈ జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ జయకేతనం ఎగురవేసింది.

నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి ఘోరంగా దెబ్బతింది. జిల్లాలోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకొంది. టీడీపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఆ పార్టీ దెబ్బతిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.కాంగ్రెస్ పార్టీకి గతగ ఎన్నికల్లో కంటే తక్కువగా ఓట్లు రావడం కూడ టీడీపీకి నష్టం చేసింది.
undefined
జిల్లా వ్యాప్తంగా 18,42,519 ఓట్లు పోలయ్యాయి. వీటిలో వైసీపీకి 10,08,848 ఓట్లు దక్కాయి. టీడీపీకి 7,12,352 ఓట్లు మాత్రమే వచ్చాయి. 18 నుండి 25 ఏళ్ల లోపు ఉన్న యువత వైసీపీకి ఓటు చేశారు. తటస్తులు కూడ ఈ దఫా జగన్‌ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఆలోచించారు. దీంతో జగన్‌ పార్టీకి ఈ జిల్లాలో భారీ మెజారిటీ దక్కింది.
undefined
జిల్లాలో పోలైన ఓట్లలో వైసీపీకి 54.75 శాతం వాటా దక్కింది. 2014లో వైసీపీకి 48.70 శాతం ఓట్లు దక్కాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల నాటికి 6 శాతం ఓట్లు పెరిగినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి2.99 శాతం ఓట్లు దక్కాయి. ఈ దఫా మాత్రం ఆ పార్టీకి కేవలం 0.91 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
undefined
గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీపై కోపం తగ్గిందని అభిప్రాయాలు కూడ లేకపోలేదు. కానీ. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉపయోగం లేదని భావించి వైసీపీ వైపు ఓట్లు మొగ్గు చూపారని సమాచారం.
undefined
కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రయోజనం ఉండదని భావించిన ఓటర్లు వైసీపీకి ఓటేశారు. కాంగ్రెస్ కు ఓటేస్తే పరోక్షంగా టీడీపీకి ప్రయోజనం కలిగే అవకాశం ఉందని బావించిన నేపథ్యంలోనే ఓట్లరు ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.
undefined
పవన్ కళ్యాణ్ పార్టీ అధికారంలోకిరాదని భావించిన యువత వైసీపీకి అనుకూలంగా ఓటు చేసిందనే అభిప్రాయాలు లేకపోలేదు. దీంతో యువత వైసీపీకి ఓటు చేశారు.ఇక జనసేనకు 2.43 శాతం, బీజేపీకి 1.05 శాతం ఓట్లు పడ్డాయి. ఈ రెండు పార్టీలు 3.5 శాతం ఓట్లను చీల్చుకున్నాయి. గత ఎన్నికల్లో జనసేన,బీజేపీలు టీడీపీకి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.
undefined
click me!