IMD Rain Alert: బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఈ అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న రెండు రోజులు వాతావరణంలో జరిగే మార్పులు ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ వ్యవస్థ శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి లోపు శ్రీలంక తీరానికి చేరుకునే అవకాశం ఉంది. పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతున్న ఈ అల్పపీడనం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై స్వల్పంగా కనిపించనుంది.
25
శుక్రవారం పొడి వాతావరణం
శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ ప్రాంతాల్లో వర్ష సూచనలు లేవు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వాతావరణం ప్రధానంగా పొడిగానే ఉంటుంది. ఉదయం వేళల్లో ఒకటి రెండు చోట్ల పొగమంచు కనిపించే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
35
శనివారం ఏపీకి వర్ష సూచన
శనివారం దక్షిణ కోస్తా ప్రాంతాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం దూరంగా ఉన్నప్పటికీ దాని అనుబంధ ప్రభావంతో ఈ వర్షాలు నమోదయ్యే వీలుంది. ఉత్తర కోస్తా ప్రాంతాల్లో మాత్రం వర్ష సూచనలు స్వల్పంగానే ఉన్నాయి.
శుక్రవారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణమే కొనసాగనుంది. తూర్పు దిశ నుంచి వీచే గాలుల కారణంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల వరకు తగ్గే సూచనలు ఉన్నాయి. ఉదయం వేళల్లో చల్లని వాతావరణం ఎక్కువగా అనిపించనుంది.
55
శనివారం తెలంగాణ వాతావరణ అంచనా
శనివారం కూడా తెలంగాణలో వర్షాల సూచనలు లేవు. పొడి వాతావరణం కొనసాగుతుంది. అయితే చలి ప్రభావం కొనసాగనుంది. ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ప్రయాణాలు చేసే వారు ఉదయం వేళల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.